హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.7.22 లక్షలకు ఆదాయపన్ను కట్టిన కేటీఆర్, ఆ ట్వీట్‌కు ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదాయపు పన్ను కట్టారు. మంత్రిగా తనకు వచ్చిన జీతాన్ని బట్టి ఆయన ట్యాక్స్ చెల్లించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదాయపు పన్ను కట్టారు. మంత్రిగా తనకు వచ్చిన జీతాన్ని బట్టి ఆయన ట్యాక్స్ చెల్లించారు.

గత ఆర్థిక సంవత్సరానికి గాను కేటీఆర్‌కు రూ. 7.22 లక్షల జీతం వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మంత్రి జీతభత్యాల నుంచి ట్యాక్స్‌ను చెల్లిస్తున్నట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పేరు మీద ఆదేశాలు వెలువడ్డాయి.

2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేటీఆర్ పన్ను చెల్లించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.

కేటీఆర్ విజ్ఞప్తి.. ప్రశంసలు

కేటీఆర్ విజ్ఞప్తి.. ప్రశంసలు

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి.

Recommended Video

KTR Speech At Water Tank Inauguration Event : PART 3 | Oneindia Telugu
ఆర్భాటాలు వద్దని..

ఆర్భాటాలు వద్దని..

తన పుట్టిన రోజున హంగు ఆర్భాటాలకు పోకుండా, డబ్బు వృథా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన పుట్టిన విజ్ఞప్తి చేశారు.

సామాన్యుడిలా..

సామాన్యుడిలా..

తన పుట్టిన రోజును కేటీఆర్ సామాన్యుడిలా జరుపుకోవాలనుకుంటున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, బొకెలు, ప్రకటనలు అంటూ హడావుడి చేయవద్దని కోరారు.

24వ తేదీన పుట్టిన రోజు

కాగా, జూలై 24వ తేదీన కేటీఆర్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు నాడు హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనాలని కెటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Telangana IT Minister Kalvakuntla Taraka Rama Rao paid Income Tax for his salary. He paid for Rs 7.22 lakh salary for year 2016-2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X