రాజకీయాల్లో అనతికాలంలోనే మంత్రిగా అవకాశం ..ఇది మల్లారెడ్డి అదృష్టం

కెసిఆర్ క్యాబినెట్లో స్థానం దక్కించుకున్న మంత్రి చామకూర మల్లారెడ్డి 1954 మార్చి 20వ తేదీన శ్రీ మల్లారెడ్డి, చంద్రమ్మ దంపతులకు జన్మించారు. భార్య పేరు కల్పన. వీరికి మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి , అనే ఇద్దరూ కుమారులు , కుమార్తె మమత ఉన్నారు. హైదరాబాద్ లో జన్మించిన మల్లారెడ్డి డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేశారు. హైదరాబాద్ లో జన్మించిన మల్లారెడ్డి హైదరాబాద్ కేంద్రంగా
ఆ తరువాత విద్యాసంస్థలు స్థాపించి మంచి ప్పేరు సంపాదించారు. అంతేకాక మంచి బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు పొందారు.

మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం

మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం

2014 మార్చి 12వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డి 2014 ఏప్రిల్ 9న మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఏకైక పార్లమెంటు సభ్యుడు చామకూర మల్లారెడ్డి. 2016 జూన్ లో టిఆర్ఎస్ పార్టీలో చేరిన మల్లా రెడ్డి 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగురవేశారు.

హైదరాబాద్ కేంద్రంగా పలు విద్యా సంస్థలు, వ్యాపారాలు

హైదరాబాద్ కేంద్రంగా పలు విద్యా సంస్థలు, వ్యాపారాలు

హైదరాబాద్ కేంద్రంగా పలు విద్యాసంస్థలు, పలు వ్యాపారాలు నిర్వహించే మల్లారెడ్డి ముఖ్యంగా యువతలో రాజకీయ చైతన్యం నింపే పలు కార్యక్రమాలు నిర్వహించారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లతో పాటుగా స్టూడెంట్ కమ్యూనిటీలో ఓటు హక్కు నమోదు పై చైతన్యం కలిగించడానికి కృషి చేశారు. అలాగే నిరుపేదలకు చదువుకోవడానికి తన వంతు సహకారం అందించడమే కాకుండా, పలు మెడికల్ క్యాంపులను సైతం నిర్వహించారు. తెలంగాణ యువతకు తన విద్యా సంస్థల్లోనూ, వ్యాపారాల్లోనూ ఉద్యోగ అవకాశాలను కల్పించి ఉపాధి అందిస్తున్నారు చామకూర మల్లారెడ్డి.

నక్క తోక తొక్కిన మల్లారెడ్డి .. రాజకీయాల్లో అనతి కాలంలోనే మంత్రి

నక్క తోక తొక్కిన మల్లారెడ్డి .. రాజకీయాల్లో అనతి కాలంలోనే మంత్రి

ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్న ఆయన రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే క్యాబినెట్ మంత్రి అయ్యారు.
మల్లారెడ్డికి ఊహించని అదృష్టం దక్కింది . చామకూర మల్లారెడ్డి మంత్రిగా తెలంగాణ క్యాబినెట్ లో కొలువు తీరారు. నక్కతోక తొక్కి వచ్చారేమో గాని రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ క్యాబినెట్ లో సీనియర్ నాయకులు ఎందరో ఉండగా వారందరినీ కాదని చామకూరమల్లారెడ్డికి కెసిఆర్ తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. మంత్రిగా మల్లారెడ్డి కి అవకాశం ఇస్తారని అటు టిఆర్ఎస్ పార్టీలో కానీ, ప్రతిపక్ష పార్టీ లో కానీ ఎవరూ ఊహించి ఉండరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+