హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్: ఒంటిపై నగలన్నీ విరాళం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం ఉదయం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం అందించారు.

యాదాద్రి ఆలయానికి సత్యవతి రాథోడ్ విరాళం

యాదాద్రి ఆలయానికి సత్యవతి రాథోడ్ విరాళం

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ యాదాద్రి ప్రధానాలయ బంగారు తాపడానికి తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. రెండు చేతి గాజులు, రింగులు, మెడ గొలుసును లక్ష్మీనరసింహ స్వామికి ఇచ్చారు. మొత్తం స్వామివారికి 12 తులాల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కరోనా విముక్తి కోసం ప్రార్థించా..: సత్యవతి రాథోడ్

కరోనా విముక్తి కోసం ప్రార్థించా..: సత్యవతి రాథోడ్


ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తాను కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని తాను నరసింహ స్వామిని ప్రార్ధించినట్లు మంత్రి సత్యవతి తెలిపారు. కాగా, యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ గోపురం బంగారు తాపడానికి విరాళాలు అందిస్తున్నారు. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ రూ. 2.50 కోట్ల విరాళం అందించాయి. హెటిరో డ్రగ్స్ సీఎండీ బండి పార్థసారథి రెడ్డి, హానర్ ల్యాబ్స్ తరపున దేవరకొండ దామోదరరావు చెక్కులను ఆలయ ఈవోకు అందించారు. హెటిర డ్రగ్స్ లిమిటెడ్ తరపున రూ. రూ. 50 లక్షలు, హెటిలో ల్యాబ్స్ లిమిటెడ్ తరపున రూ. 50 లక్షలు, హానర్ ల్యాబ్ లిమిటెడ్ తరపున రూ. 50 లక్షలు, వ్యక్తిగతంగా బండి పార్థసారథి రెడ్డి రూ. 50 లక్షలు, దేవరకొండ రామారావు రూ. 50 లక్షలు విరాళం అందించారు.

బంగారు గోపురం కోసం విరాళాలు

బంగారు గోపురం కోసం విరాళాలు

ఇది ఇలావుండగా, యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తామని, ఇందుకు విరాళాలు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. అంతేగాక, కేసీఆర్ తన ఫ్యామిలీ తరఫున కిలో 16 తులాల బంగారం విరాళంఇచ్చారు. సీఎం పిలుపుతో యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని, నగదును లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విరాళంగా ఇస్తున్నారు.

English summary
telangana minister satyavathi rathod visits yadadri temple: donated gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X