రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి రూ.15వేలు?
రైతులకు శుభవార్త. వారి ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి. దీనివల్ల ఎంతోమంది అన్నదాతలకు ఊరట కలుగుతుంది. ఇంతకీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే విషయంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాటిని అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. ఆరు గ్యారంటీలను అమలుచేసేందుకు కృషిచేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కింద అందించే పంట పెట్టుబడి సాయం రూ.15వేలు త్వరలోనే అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా నిధులు అందుతాయని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఏయే జిల్లాల్లో ఏయే పంటలు దెబ్బతిన్నాయి? ఎంతవరకు నష్టం వాటిల్లింది? నష్టపోయిన రైతుల వివరాలు.. వారికి ఏ విధంగా, ఎంతవరకు పరిహారం అందించాలి అనే విషయంపై ఆయా జిల్లాల నుంచి కలెక్టర్లద్వారా సమాచారాన్ని తెప్పించుకొని వాటి ప్రకారం అన్నదాతలను ఆదుకోవడం జరుగుతుందని తుమ్మల అన్నారు.

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, మద్దతు ధరకే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని, ఆగస్టు నెలాఖరు లోపు రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చే రెండు మూడు నెలల కాలంలో రైతులకు ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పీఎం కిసాన్ స్కీం కింద వారి అకౌంట్లలోకి డబ్బులు వేయనుంది. ఇప్పటివరకు 16 విడతల నగదు అందింది. 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే రైతులకు మొత్తంగా రూ.34వేలు వస్తాయి. జూన్ లేదంటే జులై తొలివారంలో ఈ డబ్బులు రైతులకు అందనున్నాయి.












Click it and Unblock the Notifications