రోడ్డెక్కిన తెలంగాణా ప్రభుత్వం.. ఈడీ ఆఫీస్ ముందు ధర్నా!
ఎక్కడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం ధర్నాలు చెయ్యదు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో రోడ్డెక్కింది. తెలంగాణా మంత్రులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.
రోడ్డెక్కిన తెలంగాణా మంత్రులు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా హిండెన్ బర్గ్ ఆరోపణలతో సెబీ చీఫ్ మాధబిపురి బచ్ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అదానీ వ్యవహారంపైన తేల్చాలని కోరుతూ ధర్నా
కాంగ్రెస్ పార్టీ అదాని మెగా కుంభకోణం పైన దర్యాప్తు జరపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో దీనిపైన అధికార కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా ధర్నా నిర్వహించారు. బిజినెస్ మాన్ అదానీ వ్యవహారంపైన తేల్చాలని కోరుతూ ధర్నా చేశారు.సెబీ చీఫ్ మాధబిపురి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపైన జేపీసీ దర్యాప్తు చేపట్టాలని ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపైన స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు.. తెలంగాణాలోనూ
సెబి నిబంధనలు ఉల్లంఘించినట్టు మాధవిపై ఇటీవల హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈడీ కార్యాలయాల వద్ద నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్
ధర్నా సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ అదాని అప్రజాస్వామికంగా దేశసంపదని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేసిన సందర్భాలు ఉన్నాయని వీరు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బిజెపి పాలనలో ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చెయ్యాల్సి వస్తుంది
పదేళ్ల బిజెపి పాలనలో ఈడీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని ప్రజలు ఊహించలేదని వారు పేర్కొన్నారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రి తుమ్మల, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం నాగేందర్ ,జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications