హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత: కౌంటింగ్‌లో దూకుడు: ఎల్ రమణ భవితవ్యం?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు మొదలు పెట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో ఈ ఎన్నికల పోలింగ్ ఇదివరకే ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కించడానికి అయిదు చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తి ఫ‌లితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కరీంనగర్ జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో..

టీఆర్ఎస్ తరఫున ఎల్ రమణ, భాను ప్రసాదరావు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.

 విజయోత్సవాలకు నో

విజయోత్సవాలకు నో


కరోనా వైరస్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు, ర్యాలీలను నిర్వహించడానికి వీల్లేదంటూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట 25 చొప్పున పోలైన ఓట్లను కట్టలుగా కట్టారు. ఆ తర్వాత లెక్కింపు ప్రారంభిస్తారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చేపట్టారు. ఇక్కడ 1,320 ఓట్లు పోల్ అయ్యాయి.

నల్లగొండ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

ప్రాధాన్యత క్రమంలో 33 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజేత తేలకపోతే.. రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. మహిళా శక్తి సమాఖ్య భవన్‌లో ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, నలుగురు సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు నియమించారు. ప్రతి టేబుల్‌పై 200 ఓట్లు లెక్కిస్తారు.

 ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం జిల్లాలో..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,233 ఓట్లు పోలయ్యాయి. బరిలో ఏడుమంది అభ్యర్థులు ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కే నగేష్, స్వతంత్ర అభ్యర్థిగా లక్ష్మయ్య బరిలో ఉన్నారు. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 740 ఓట్లు పోల‌య్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు పోటీ చేశారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో 1018 ఓట్లు పోల‌య్యాయి.

Recommended Video

సీడీఎస్‌ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన బీజేపీ నేత డీకే అరుణ || Oneindia Telugu
నిబంధనలు ఉల్లంఘిస్తే..

నిబంధనలు ఉల్లంఘిస్తే..


టీఆర్ఎస్ నుంచి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మల జగ్గారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మట్టా మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. మెదక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని జిల్లాల ఓట్ల లెక్కింపు కేంద్రాల గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తోన్నారు. ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

English summary
Telangana MLC Election Results 2021 Counting Begins in the State. Here is the all details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X