ప్రమాణస్వీకారం చేసిన 5గురు ఎమ్మెల్సీలు
ఇటివల నామినేట్ కాబడిన అయిదుగురు తెలంగాణ ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీనుండి మంత్రి మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్,శేరి సుభాస్ రెడ్డి, యెగ్గే మల్లేశం కాగా ఎంఐఎం నుండి రియాజ్ ఉల్ హసన్ లు ఎమ్మెల్సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మణ్ స్వామి గౌడ్ పదవి కాలం ముగియడంతో, డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయన చాంబర్ లో నూతన సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావులతోపాటు ఇతర నేతలు పాల్గోన్నారు.













Click it and Unblock the Notifications