Telangana Muncipal Elections 2026 Live: తెలంగాణలో ముగిసిన పోలింగ్..!!
Telangana Municipal Elections 2026 Live Updates :తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఇక ఫలితాలు ఈ నెల 13వ తేదీన వెలువడనున్నాయి. పోలింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో, స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.
మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం పుంజుకుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ప్రతి గంటకూ మారుతున్న పోలింగ్ సరళిని, క్షేత్రస్థాయి పరిస్థితులను మా లైవ్ బ్లాగ్ ద్వారా మీకు నిరంతరం అందిస్తూనే ఉంటాం. అభ్యర్థుల గెలుపోటములపై మీ అభిప్రాయాలను పంచుకోండి తాజా అప్‌డేట్స్ కోసం మా పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

#WATCH | Kumuram Bheem Asifabad, Telangana: Municipal elections are underway in Kagaznagar, Kumuram Bheem Asifabad district.
— ANI (@ANI) February 11, 2026
Visuals from a polling station at Balabarathi School.
(Source: PRO, Police) pic.twitter.com/HivYDFSIVg
#WATCH | Union Minister G. Kishan Reddy, along with BJP leaders, met the family of Mahadevappa, a Makthal Municipality BJP candidate who died allegedly by hanging in Narayanpet district.
— ANI (@ANI) February 11, 2026
BJP has alleged that Congress leaders were putting pressure on Mahadevappa to withdraw his… pic.twitter.com/IRBxVDyhdI












Click it and Unblock the Notifications