వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 సంవత్సరాల్లోనే గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన డా.తమిళ్‌సై సౌందర్‌రాజన్ నియమింపబడ్డారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయని రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు. అయినా పార్టీ సిద్దాంతాలు, నిర్మాణం కోసం పోరాడిన మహిళను గవర్నర్‌గా నిమమించారు. ముఖ్యంగా ఆమే తమిళనాడులో సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాద్యతలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా ఆమేను గవర్నర్ పదవి వరించింది.

తెలంగాణ కొత్త గవర్నర్‌గా సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తాత్రేయతెలంగాణ కొత్త గవర్నర్‌గా సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తాత్రేయ

సౌందర్‌రాజన్ కుటుంభ నేపథ్యం

సౌందర్‌రాజన్ కుటుంభ నేపథ్యం

ప్రజాస్వామ్య వ్వవస్థలో కష్టపడిన నాయకులకు ఎప్పుడు గుర్తుంపు వస్తుందనే దానికి తెలంగాణ తొలి మహిళ గవర్నర్ గా నిమమింపబడ్డ సౌందర్ రాజన్ మరో ఉదహారణ, ప్రజల నుండి ఎప్పుడు నేరుగా గెలవకున్న పార్టీని నమ్ముకున్న ఆమేకు అదిష్టానం ఉన్నత స్థానాన్ని కల్పించింది. ఆమే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోలి గ్రామంలో 1961 జూన్ 2న జన్మించారు. కాగా ఆమే ఎంబీబీస్ పూర్తి చేసి కొంతకాలం వైద్యురాలిగా సేవలు అందించారు. ఇక ఆమే భర్త సౌందర్‌రాజన్ కూడ తమిళనాడులో వైద్యవృత్తిలోనే కొనసాగుతున్నారు. కాగా ఆమేకు ఒక కుమారుడు ఉన్నాడు.

రాజకీయ నేపథ్యం..

రాజకీయ నేపథ్యం..

సౌందర్‌రాజన్ తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చింది. ఈనేపథ్యంలోనే ఆమే తండ్రి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేపథ్యం ఉన్న వాడు కాగా ఏంపీగా కూ ఎన్నికయ్యారు. మొత్తం మీద ఆమే కుటుంభం అంతా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమే మాత్రం విద్యార్థిదశలోనే రాజకీయాలకు చేరువై బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీ విభాగం చెన్నై జిల్లా కార్యదర్శిగా 1999 లోఎన్నికయ్యారు. అనంతరం 2001లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న సమయంలో రాష్ట్ర వైద్యవిభాగం ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన ఆమే అనంతరం పార్టీలోకి ప్రవేవించారు. ఇ 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ,2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలిగా, 2013లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై భాద్యతలు చేపట్టారు.

ఎన్నికల నేపథ్యం

ఎన్నికల నేపథ్యం

విద్యార్థి దశ నుండి పార్టీ జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సౌందర్‌రాజన్ ప్రత్యక్షంగా జరిగే ఎన్నికల్లో ఎప్పుడు గెలవని పరిస్థితి, గతంలో జరిగిన నాలుగు ఎన్నికల్లో పోటి చేసిన ఆమే ఓటమిని మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2006,2011లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయగా, 2009,పోటి ఓడిపోయారు. కాగా తాజాగా గత 2019లో తూత్తుకుడి పార్లమెంట్ స్థానం నుండి పోటి చేసిన ఆమే సుమారు రెండు లక్షల ఒట్లతో ఓటమి చెందారు. మొత్తం మీద 12 సంవత్సరాల పాటు పార్టీకి సేవలు అందించిన ఆమే అనతి కాలంలో గవర్నర్ అయ్యారు.

English summary
Tamil Nadu's Dr Soundar Rajan has been appointed as the first woman governor of Telangana state. However, Tamil Nadu is one of the states where the BJP is not favored in the southern states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X