తెలంగాణలో అదే స్పీడ్: 31 వేలను దాటి: జోరుగా టెస్టింగులు: అదే రేంజ్‌లో కేసులూ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ విజృంభిస్తోంది. గంటగంటకూ ప్రభావాన్ని చూపుతోంది. మూడు వేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా మూడువేలకు కాస్త అటు ఇటుగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. ఫలితంగా- యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. 31 వేలమందికి పైగా కరోనా పేషెంట్లు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ సంఖ్య 31 వేలకు చేరుకోవడం.. కరోనా కేసుల పెరుగుదలలో కనిపించిన వేగాన్ని స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2924 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 1638 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,23,090కి చేరుకుంది. ఇందులో 90,988 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల 818 మంది ఇప్పటిదాకా మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,284గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 24,176 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల దూకుడు కొనసాగుతోంది. కొత్తగా 461 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు వందలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్ అర్బన్, సూర్యాపేట్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ సహా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది.
కొత్తగా ఆదిలాబాద్-36, భద్రాద్రి కొత్తగూడెం-88, జగిత్యాల-92, జనగామ-46, జయశంకర్ భూపాలపల్లి-24, జోగుళాంబ గద్వాల-35, కామారెడ్డి-56, కరీంనగర్-56, ఖమ్మం-181, కొమరంభీమ్ ఆసిఫాబాద్-10, మహబూబ్ నగర్-58, మహబూబాబాద్-80, మంచిర్యాల-91, మెదక్-45, మేడ్చల్ మల్కాజ్‌గిరి-153, ములుగు-34, నాగర్ కర్నూలు-51, నల్లగొండ-171, నారాయణపేట్-13, నిర్మల్-33, నిజామాబాద్-140, పెద్దపల్లి-83, రాజన్న సిరిసిల్ల-55, రంగారెడ్డి-213, సంగారెడ్డి-44, సిద్ధిపేట్-97, సూర్యాపేట్-118, వికారాబాాద్-15, వనపర్తి-46, వరంగల్ రూరల్-17, వరంగల్ అర్బన్-102, యాదాద్రి భువనగిరి-64 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
తెలంగాణ ప్రభుత్వం రోజువారీ కరోనా వైరస్ పరీక్షల్లో జోరును కొనసాగిస్తోంది. కొత్తగా వ్యాప్తంగా 61,148 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 13,27,791కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 35,763 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు ఈ సంఖ్య 20 వేలు, అంతకు దిగువకే నమోదవుతుండేది.












Click it and Unblock the Notifications