హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో 19వేలకుపైగా పోలీస్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.
పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోల కల సాకారం చేసేందుకు కసరత్తులు చేస్తోంది. త్వరలోనే పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన ఉంది.

తెలంగాణ ప్రభుత్వం 19వేలకుపైగా కానిస్టేబుల్ పోస్టులు, 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక పంపించారు. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానుది. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

 Telangana: notification for 19k police jobs to be released soon

ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఖాళీల భర్తీ విధానంలో మార్పులు ఏమైనా చేస్తారా? అనేది త్వరలోనే వెల్లడికానుంది. గత నోటిఫికేషన్ల విడుదల సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీస్ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవడంతోపాటు నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని రకాల సమాచారం ఇవ్వనుంది. అభ్యర్థులు ఈ యాప్ ద్వారానే నియామక బోర్డును సంప్రదించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, పోలీస్ శాఖలో ఖాళీల వివరాలు గమనించినట్లయితే.. సివిల్ ఎస్ విభాగంలో 360, ఏఆర్ ఎస్ఐ 29, కమ్యూనికేషన్స్ 20 ఉన్నాయి. కానిస్టేబుల్ ఖాళీల వివరాల్లోకి వస్తే సివిల్ విభాగంలో 7,700, ఏఆర్ 6680, టీఎస్ఎస్పీలో 3850, 15వ బెటాలియన్‌లో 560, కమ్యూనికేషన్ విభాగంలో 250 ఖాళీలున్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 19,449 పోస్టులు ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

English summary
Telangana: notification for 19k police jobs to be released soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X