జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి: వచ్చే ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

హైదరాబాద్: ఈ ఏడాది జులై నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించారు.

బుధవారం నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది జులై నెల చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Telangana Panchayat Elections To Be Complete At July End

ఈ 2 నెలల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేశామని నాగిరెడ్డి తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల ఓటర్లు పాల్గొంటారన్నారు. ముద్రణా సామాగ్రి అంతా జూన్ 15 నాటికి సిద్ధమవుతుందన్నారు. కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులను గుర్తించి నియమించాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణను జిల్లాల్లోనే ముద్రించాలని, సరిపడా బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సిబ్బంది నిర్వహణ మినహా మిగతా పనులను జూన్ 10లోగా పూర్తి చేయాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశాన్ని యంత్రాంగం కల్పించాలని అధికారులకు చెప్పారు. భవిష్యత్ తెలంగాణకు పంచాయతీ ఎన్నికలు కీలక పునాది అని నాగిరెడ్డి పేర్కొన్నారు.

కాగా, బీసీ ఓటర్ల గణన జూన్ 1లోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులను ప్రస్తుతం బదిలీ చేయట్లేదన్నారు. ఎన్నికల తర్వాత పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా సహకరిస్తామన్నారు.

త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై పోలీసు అధికారులకు సమగ్ర అవగాహన ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. చాలా మంది ఎస్పీలు తొలిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్సైజ్, అటవీ తదితర శాఖల సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. ప్రతి ఎస్పీ, కమిషనర్ కూడా ఒక్క అవాంఛనీయ ఘటన జరగకూడదన్న టార్గెట్‌తో పని చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+