Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామాలు..!!

Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి ఓడిపోయిన అనంతరం తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన మాజీ అధికారులు ఒక్కొక్కరుగా తమ పదవులకు రాజీనామాలు చేస్తోన్నారు. స్వచ్ఛందంగా తప్పుకొంటోన్నారు.

ఈ ఎన్నికల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 38 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ సారి ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఇచ్చారు. మొత్తంగా 66 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది.

Telangana police Anti Naxal Wing OSD T Prabhakar Rao resigned from his post

ప్రభుత్వాన్ని ఏర్పాటు నెలకొల్పడానికి కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క.. ఈ రాత్రి 8:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు తెలిపింది.

ఈ పరిణామాల మధ్య కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో ముఖ్య సలహాదారులు, ఆఫీసర్- ఆన్- స్పెషల్ డ్యూటీ, ఇతర విభాగాధిపతులుగా పని చేసిన వార తమ పదవులకు రాజీనామాలు చేస్తోన్నారు. ఇదివరకే జెన్‌కో ఎండీ డీ ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి తన సలహాదారు పదవికి రాజీనామాలు చేశారు.

తాజాగా- తెలంగాణ పోలీస్ యాంటీ నక్సల్స్ ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీగా పని చేస్తోన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. మూడు సంవత్సరాల కిందట ఆయనను ఓఎస్డీగా నియమించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్ష నేతల టెలిఫోన్లను ట్యాప్ చేస్తోన్నారంటూ ప్రభాకర్ రావుపై గతంలో రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

తమ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం విచారణలను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా టీ ప్రబాకర్ రావు తన పదవి నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ఛైర్మన్లు స్వచ్ఛందంగా వైదొలగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+