వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు శౌర్య పతకాల పంట : రికార్డు స్థాయి అవార్డులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీసుల శ్రమకు శౌర్య పతకాల పంట పండింది. మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి అత్యధిక శౌర్యపతకాలు దక్కగా.. ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజులకు మరణానంతరం శౌర్య పతకాలు దక్కాయి. ఇక శౌర్య పతకాల్లో అత్యున్నత పురస్కారమైన శౌర్యచక్ర కూడా తెలంగాణ పోలీస్ కే దక్కడం విశేషం.

శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో..రెండు రాష్ట్రపతి గ్యాలెంటరీ పోలీస్ అవార్డులతో పాటు మొత్తం 38 అవార్డులు తెలంగాణ పోలీసులను వరించాయి. ఇందులో రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు 2, శౌర్య పోలీసు పతకాలు 24, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 ఉండడం గమనార్హం.

దేశం మొత్తంలో అశోక్ శౌర్య పతకం ఒకరిని వరించగా.. 14 మందికి శౌర్య చక్ర అవార్డులు దక్కాయి. ఇందులో తెలంగాణ నిఘా విభాగపు కానిస్టేబుల్ కె.శ్రీనివాసులుకు శౌర్య పతకం దక్కింది. ఉమ్మడి ఏపీ చరిత్రలోను.. ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రంలోను ఇంతకుముందెప్పుడూ ఓ కానిస్టేబుల్ స్థాయి అధికారిని ఈ అవార్డు వరించలేదు. విధి నిర్వహణలో భాగంగా.. గత ఫిబ్రవరిలో బెంగుళూరులో ఆలం జెబ్ అనే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు శ్రీనివాసులు. ఆ క్రమంలో ఆయన కత్తిపోట్లుకు కూడా గురై ప్రాణపాయ స్థితిలోకి వెళ్లారు. అత్యంత అరుదుగా మాత్రమే పోలీస్ విభాగానికి దక్కే ఈ అవార్డు శ్రీనివాసులును వరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇక నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజులకు మరణాంతర రాష్ట్రపతి శౌర్య పతకాలు ప్రకటించింది కేంద్రం. రికార్డు స్థాయిలో తెలంగాణ పోలీసులకు కేంద్ర పురస్కరాలు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసులకు అభినందనలు తెలియజేశారు. ఇకపోతే ఏపీకి రెండు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలతో పాటు 14 అత్యుత్తమ సేవా పతకాలు లభించాయి.

Telangana police got record level shaurya awards

తెలంగాణ శౌర్య పతక గ్రహీతలు :

-ఎర్రబాటి శ్రీనివాసరావు (కమాండెంట్, 7వ బెటాలియన్, టీఎస్‌ఎఎస్‌పీ, డిచ్‌పల్లి, నిజామాబాద్)
-చింతకుంట్ల నరోత్తమ్‌రెడ్డి (అదనపు ఎస్పీ, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రాంచంద్రాపురం, మెదక్)
-కృష్ణస్వామి నటరాజన్ బాలాజీ (అసిస్టెంట్ కమాండెంట్, 15వ బెటాలియన్, సత్తుపల్లి, ఖమ్మం)
-పోతరిలంక మురళీకృష్ణ (అదనపు ఎస్పీ, ఎస్‌ఐబీ, హైదరాబాద్)
-షేక్ మహ్మద్ నజీముద్దీన్ (ఏసీపీ, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సెల్, హైదరాబాద్)
-అంగోత్ బాలకోఠి (డీఎస్పీ, గద్వాల్, మహబూబ్‌నగర్)
-అంగ్రా వెంకట సత్యనారాయణ (ఇన్‌స్పెక్టర్, ఎస్బీ, హైదరాబాద్)
-దాలాదుల వీరనాగయ్య (ఏఎస్సై, ఇంటలిజెన్స్, హైదరాబాద్)
-వీ పాండురంగారావు (ఏఎస్సై, సీఐ సెల్, హైదరాబాద్)
-మహ్మద్ అబ్దుల్ నహీమ్ (హెడ్‌కానిస్టేబుల్, ఫస్ట్ బెటాలియన్, హైదరాబాద్)
-దామకొండ బాలకృష్ణ (హెడ్‌కానిస్టేబుల్, ఇంటలిజెన్స్, హైదరాబాద్)
-ఉత్తమసేవ పోలీసు పతక గ్రహీతలు
-డాక్టర్ తైపర్తి ప్రభాకర్‌రావు (డీఐజీ, వరంగల్ రేంజ్)
-రాజేశ్‌కుమార్ (డీఐజీ, సీఐ సెల్, ఇంటలిజెన్స్)
-ముతకోడురు చంద్రశేఖర్ (అదనపు ఎస్పీ, సీఐ సెల్)
-మాద దయానంద్‌రెడ్డి (డీఎస్పీ, సీఐ సెల్)
-సీహెచ్‌ఆర్‌వీ ఫణీందర్ (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్)
-వేముల భాస్కర్ (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్)
-ఖైత రవీందర్‌రెడ్డి (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్)
-అన్నారెడ్డి చిన్న బాల గంగిరెడ్డి (ఇన్‌స్పెక్టర్, నల్లగొండ)
-గంగటి సత్యనారాయణ (ఎస్సై, సీఐ సెల్)
-సోనీలాల్ అమృత్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్)
-సయ్యద్ సర్వర్ పాషా (హెడ్‌కానిస్టేబుల్, సీఐ సెల్)
-మహ్మద్ ముజీబ్ (హెడ్‌కానిస్టేబుల్, సీఐ సెల్)
-సయ్యద్ అబ్దుల్ ఖరీమ్ (హెడ్‌కానిస్టేబుల్, సీఐ సెల్)
-జీ నరేందర్ (కానిస్టేబుల్, సీఐ సెల్)
-ఎండీ ఖాదీర్ (కానిస్టేబుల్, సీఐ సెల్)
-ఎండీ తాజ్‌పాషా (కానిస్టేబుల్, సీఐ సెల్)
-ఎస్ రాజవర్ధన్‌రెడ్డి (కానిస్టేబుల్, సీఐ సెల్)
-ఎండీ ముష్రాఫ్ బాబా (కానిస్టేబుల్, సీఐ సెల్)
-ఎన్ అనిల్‌కుమార్ (కానిస్టేబుల్, నల్లగొండ)
-వేమదాది రమేశ్ (కానిస్టేబుల్, నల్లగొండ)
-కొంతం మధుసూదన్ (కానిస్టేబుల్, నల్లగొండ)
-తోడేటి శివ కోటేశ్వరరావు (కానిస్టేబుల్, నల్లగొండ)
-ముత్తినేని శ్రీను (కానిస్టేబుల్, నల్లగొండ)
-ఎల్ జానకీరామ్ (కానిస్టేబుల్, నల్లగొండ)

రాష్ట్రపతి శౌర్య పతక గ్రహీతలు :

అత్యుత్తమ రాష్ట్రపతి శౌర్య పతకం
-దూదేకుల సిద్ధయ్య (ఎస్‌ఐ)
-చౌగోని నాగరాజు (కానిస్టేబుల్)

English summary
Telangana police got record level Shaurya puraskars. Total 38 awards were for telangana police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X