హోం శాఖలో ఉద్యోగాల జాతర.. 7వేల పోస్టుల భర్తీ!
నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ హోం శాఖలో పోలీస్, జైళ్ళు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొలుపుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణా ప్రభుత్వం.
హోం శాఖలో దాదాపు 7,000 కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
మొత్తంగా హోం శాఖలో దాదాపు 7,000 కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వీటిలో 5000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 5000 పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన రెండు వేల పోస్టులు జైళ్ల శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాలలో భర్తీ చేయాలని ప్లాన్ చేసుకుంది.

త్వరలో నోటిఫికేషన్
పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఒకటి రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
భారీ నియామకాలు .. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగవది
ఇదిలా ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగవ భారీ నియామకం. 2015 హలో మొదటిసారి 9,281 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2018లో 1217 ఎస్సైలు, 16, 285 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2022లో 554 ఎస్సైలు, 15 వేల 644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా భర్తీ చేస్తుంది.
నిరుద్యోగ యువతకు ఇది పండుగ లాంటి వార్త
ఇక ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు ఇంత భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ప్రస్తుతం హోమ్ శాఖలో ఉద్యోగాల కోసం యువకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు ఇది పండుగ లాంటి వార్త. ఈ నియామకాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను లభించడమే కాకుండా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కూడా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది.













Click it and Unblock the Notifications