దొంగ వాహనాల కోసం ప్రత్యేక యాప్ (ఫోటోలు)
హైదరాబాద్: దొంగలు ఎత్తుకెళ్లిన వాహనాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను గుర్తించేందుకు హైదరాబాద్ పోలీసులు సరికొత్త యాప్‌ను రూపొందించారు. 'స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్' పేరుతో ఒక మొబైల్ యాప్‌ను తయారు చేశారు.
ఎస్సై నుంచి డీజీపీ స్దాయి అధికారి వరకు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ‘ఈ యాప్‌ను కేవలం పోలీసుల కోసమే రూపొందించాం. ఇది పోలీసుల ఇంటర్నల్ యాప్' అని హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతల పోలీసులే కాకుండా ట్రాఫిక్ పోలీసులూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాక్షమే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. తాము స్వాధీనం చేసుకుంటున్న వాహనాల సొంతదారులను గుర్తించడంలో జాప్యం చోటుచేసుకోవడం, పోలీస్ ఠాణాల్లో అవి పడుండడంతో పనికి రాకుండా పోతున్నాయని ఈ సమస్యను పరిష్కరించేందుకు 'యాప్' ను రూపొందించామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పోలీసు కమిషనరేట్లు, జిల్లాల్లోని అన్ని పోలీస్ ఠాణాల పరిధుల్లో పనిచేస్తున్న ఎస్సైలు, సీఐలు, ఉన్నతాధికారులకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు కమిషనర్ అంజనీకుమార్, క్రైమ్స్ అదనపు కమిషనర్ స్వాతిలక్రా, స్పెషల్‌బ్రాంచ్ సంయుక్త కమిషనర్ బి.మల్లారెడ్డితో కలిసి బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు.
ప్రస్తుతం ఎస్వీఎస్టీ యాప్‌ను తెలంగాణలోని పది జిల్లాల పోలీసు అధికారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లో దీన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయాలని భావించినా అందరికీ ఉపయోగకరంగా ఉండేలా దీన్ని మార్పు చేశారు. దీని ప్రకారం పది జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లలో నమోదైన వాహనాల చోరీ కేసుల వివరాలు ఈ యాప్‌కు అనుసంధానమై ఉంటాయి. ఇటువంటి యాప్‌నే ఢిల్లీ పోలీసులు రూపొందించారు.

చోరీకి గురైన వాహనాల కోసం ప్రత్యేక యాప్
దొంగలు ఎత్తుకెళ్లిన వాహనాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను గుర్తించేందుకు హైదరాబాద్ పోలీసులు సరికొత్త యాప్‌ను రూపొందించారు. 'స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్' పేరుతో ఒక మొబైల్ యాప్‌ను తయారు చేశారు.

చోరీకి గురైన వాహనాల కోసం ప్రత్యేక యాప్
ఎస్సై నుంచి డీజీపీ స్దాయి అధికారి వరకు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ‘ఈ యాప్‌ను కేవలం పోలీసుల కోసమే రూపొందించాం. ఇది పోలీసుల ఇంటర్నల్ యాప్' అని హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Click it and Unblock the Notifications