డైరీలో విస్తుగొలిపే విషయాలు: ఫర్హానా నయీం భార్య కాదన్న శంషాబాద్ డీసీపీ

హైదరాబాద్: షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్సింగి, మిర్యాలగూడ, భువనగిరిలో ఉన్న నయీం కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు వందల సంఖ్యలో బ్యాంక్ పాస్ పుస్తకాలు, చెక్‌బుక్‌లతో పాటు నయీం డైరీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నయీం చేసిన భూదందాలు, ల్యాండ్ సెటిల్ మెంట్లు, భూముల వివరాలకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు.

Telangana police seized gangster nayeem dairy

నయీం తనకు తానుగా తీర్పులు ఇవ్వడంతో పాటు పారిశ్రామిక వేత్తలు, బిజినెస్ మ్యాన్‌ల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన వివరాలు అతని డైరీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడిన వివరాలను సైతం అందులో రాసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

నయీం షాక్: 2నెలల్లో 200 కోట్లు, అమ్మాయిలకి షార్ప్ షూటింగ్, తెరపైకి శ్రీధర్

ఎవరికి డబ్బులు ఇచ్చింది, డబ్బు ఖర్చు తదితర వివరాలన్నీ డైరీలో రాసున్నాయని ఆయన చెప్పారు. వీటితో పాటు నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని ఆయన తెలిపారు. నయీం అత్త దగ్గర నుంచి 430 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

ఈ మొత్తం డాక్యుమెంట్ల విలువ రూ. 1680 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. వీటితో పాటు నయీం డెన్‌లకు సంబంధించిన తాళాలను కూడా స్వాధీనం చేసకున్నట్లు ఆయన తెలిపారు. నయీం డైరీలో తాను టార్గెట్ చేసిన ధనవంతుల వివరాలు ఉన్నట్లు తెలిపారు.

రెండు నెలల్లో రూ. 200 కోట్లను నయీం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది కాలంగా నయీం షాద్ నగర్‌లోనే ఉంటున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. నయీం ఇద్దరు కుమారులు, ఒక కూతురు కూడా స్థానిక స్కూల్లో చదివినట్లు ఆయన పేర్కొన్నారు.

నల్గొండలో ఉగ్రజాడ: 16 ఏళ్లకు కర్ణాటక చర్చి పేలుళ్ల నిందితుడు అమీర్ అలీ అరెస్ట్

కాగా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఫర్హానా అనే యువతి నయీం భార్య కాదని ఆయన తెలిపారు. ఫర్హానా నయీం ఇంట్లో వంట మనిషి అని తెలిపారు. నయీం కుటుంబ సభ్యులపై ఛీటింగ్, కిడ్నాప్, ఆయుధం చట్టం, బెదిరింపులు లాంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కొందరిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+