వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివైండ్ 2016.టిఆర్ఎస్ కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది,

ఈ ఏడాది టిఆర్ఎస్ కు అనుకూలమైన ఫలితాలను ఇచ్చాయి. అయితే విపక్షాలకు మాత్రం ఇబ్బందికరమైన ఫలితాలే వచ్చాయి. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు తీవ్రనష్టాన్ని పొందాయి ఈ ఏడాదిలో.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :ఏడాది తెలంగాణాలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు మంచి ఫలితాలే వచ్చాయి. విపక్షాలను అధికార పార్టీ మరింత ఇబ్బందిపెట్టేలా చేసింది. విపక్షపార్టీల నుండి పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి వలసలు పెరిగాయి. స్థానికసంస్థల్లోనూ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అధికార టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఏడాది టిడిపికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెట్టింది. ఆ పార్టీకి చెందిన కీలకమైన ఎంఏల్ఏలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు కూడ అధికార పార్టీలో చేరారు.

బిజెపి, లెఫ్ట్ పార్టీలకు కూడ ఈ ఏడాది ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. అసెంబ్లీలో సిపిఐ ఎంఏల్ఏ రవీంద్ర కుమార్ పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలకు గట్టిపట్టున్న స్థానాల్లో కూడ ఒకటి రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు అధికారపార్టీలోకి వలస వెళ్ళడం ఆ పార్టీని కలవరపెడుతోంది. పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కూడ ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ సమావేశాలను నిర్వహిస్తోంది. ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.

సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది ఎంఏల్ఏలు గెలిచిన టిడిపి బలం ప్రస్తుతం మూడుకే పడిపోయింది. టిడిపి నుండి గెలిచిన ఎంఏల్ఏలు పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారు.జిహెచ్ఎంసి ఫలితాలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి.తనకున్న అవకాశాలను పార్టీ విస్తరణ కోసం బిజెపి రాష్ట్ర నాయకత్వం ఉపయోగించుకోలేకపోతోందని జాతీయ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడంతో పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెరిగింది. జిహెచ్ ఎం సి ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. టిడిపితో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసింది. కాని, ఈ ఎన్నికల్లో మాత్రం టిడిపి కోలుకోలేని దెబ్బతింది. జిహెచ్ఎంసి ఎన్నికలపైనే అత్యధికంగా ఆశ పెట్టుకొన్న ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. ఒక్క స్థానాన్ని మాత్రమే జిహెచ్ ఎం సి ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకొంది.

టిఆర్ఎస్ కు కలిసివచ్చిన ఏడాది

టిఆర్ఎస్ కు కలిసివచ్చిన ఏడాది

ఈ ఏడాది ఆది నుండి చివరి వరకు ఏ ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ కు మంచి ఫలితాలే వచ్చాయి. అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయదుందుంభి మోగించింది, ఈ ఎన్నికలపైనే చివరి వరకు ఆశపెట్టుకొన్న టిడిపికి మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా ఈ ఫలితాలు చూసిన ఆ పార్టీ నాయకులు పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ కూడ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆందోళనలు చేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. విపక్షాలను గుక్కతిప్పుకోకుండా తన రాజకీయ వ్యూహంతో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేసిన వ్యూహంతో విపక్షాలు ఇబ్బందులు పడుతున్నాయి.నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నిక, జిహెచ్ ఎం సి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. నారాయణఖేడ్ ఎంఏల్ ఏ గా ఉన్న కిష్టారెడ్డి మరణంతో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీదే. ఈ స్థానంలో టిఆర్ఎస్ విజయం సాధించింది.మరోవై.పు పాలేరు ఉప ఎన్నికల్లో రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విజయం సాధించారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ ఏ రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణం తో ఈ అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది మే 16వ, తేదిన ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 4వ, తేదిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించారు.ఈ ఏడాది ఫిబ్రవరి లో జిహెచ్ ఎం సి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 150 వార్డులకు గాను 99 వార్డులను టిఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఒక్క స్థానంతోనే టిఢిపి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిజెపి నాలుగు స్థానాలు, కాంగ్రెస్ కు రెండు స్థానాలు, ఎంఐఎంకు 44 స్థానాలు దక్కాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని కెటిఆర్ తన భుజాన వేసుకొన్నాడు. ఈ ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ కు మంచి నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది.ఈ ఎన్నికలకు నెలరోజుల ముందుగా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు కూడ టిఆర్ఎస్ విజయానికి కలిసివచ్చాయి.ఏడాదికి 1200 రూపాయాల ఆస్తిపన్నును చెల్లించే వారు కేవలం 101 రూపాయాలు చెల్లిస్తే సరిపోతోందని నిర్ణయం తీసుకొన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఈ నిర్ణయాలు కూడ టిఆర్ఎస్ విజయానికి దోహదపడ్డాయని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని అన్ని ఒకటి రెండు మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి కూటమి ప్రభావం చూపింది. అయితే జిహెచ్ ఎం సి ఎన్నికల్లో కూడ టిడిపి బిజెపి కూటమిగా పోటీచేసిన ఫలితం మాత్రం లేకుండా పోయింది. బిజెపికి నాలుగు స్థానాలు దక్కితే, టిడిపి ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టిడిపి సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ,రాజేంద్రనగర్ ఎంఏల్ఏ ప్రకాష్ గౌడ్ పార్టీని వీడారు. ఈ ఎన్నికల సమయంలోనే కుత్బుబుల్లాపూర్ ఎంఏల్ ఏ వివేకానంద్ గౌడ్ కూడ టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటేడ్ పదవులు

పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటేడ్ పదవులు

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఆరంభించిన తొలి నాళ్ళలో తనతో పాటు కలిసినడిచిన వారికి నామినేటేడ్ పదవులను కట్టబెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్ కమిటీ పదవులను భర్తీ చేయడం ప్రారంభించారు. అక్టోబర్ మాసంలో సుమారు 10 మందికి కార్పోరేషన్ పదవులను కట్టబెట్టారు. తనతో ఉద్యమంలో కలిసి ఉన్నవారిలో అత్యధికులకు ఈ నామినేటేడ్ పదవులు దక్కాయి.నామినేటేడ్ పోస్టుల భర్తీతో పార్టీలో మొదటి నుండి పనిచేసినవారికి కొంత సంతృప్తి దక్కింది. రానున్న రోజుల్లో మరింత మందికి పదవులు వరిస్తాయని పార్టీ నాయకత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుచేసి ఈ డిసెంబర్ కు రెండున్నర ఏళ్ళు పూర్తి అవుతోంది. అయితే రెండున్నర ఏళ్ళలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.అయితే పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఈ సభ నిర్వహాణను రద్దు చేసుకొన్నారు.

ఉత్సహాన్ని నింపిన సర్వే ఫలితాలు

ఉత్సహాన్ని నింపిన సర్వే ఫలితాలు

ఈ ఏడాది అక్టోబర్ మాసంలో టిఆర్ఎస్ ఒక అంతర్గత సర్వే నిర్వహించుకొంది. ఈ సర్వే ఫలితాలు విపక్షాలను దిమ్మతిరిగేలా చేశాయి.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 109 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ కు తిరుగులేదని ఆ సర్వే ఫలితాలు తేల్చిచెప్పాయి. విపక్షాలకు ఈ సర్వే తీవ్ర నిరాశే మీగిల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 109 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి.సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అనే సంస్థ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి 10 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 79.2 శాతం ప్రజలు కెసిఆర్ పాలనను మెచ్చుకొన్నారు. ఎంఐఎంకు 7 , బిజెపికి ఒకటి, కాంగ్రెస్ కు 2, టిడిపి, సిపిఎం, సిపిఐ వైసిపి లకు ఒక్కస్థానం కూడ దక్కదని ఆ సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వేను విపక్షాలు కొట్టిపారేశాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 33.66 శాతం ఓట్లు రాగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 67.88 శాతం మంది ఓట్లు వేస్తామని చెప్పారు. 22 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 80 శాతానికి పైగా ఓట్లు వస్తాయని, 9 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓట్లు వస్తాయని తేల్చింది.

ఉనికి కోసం కాంగ్రెస్ పాట్లు

ఉనికి కోసం కాంగ్రెస్ పాట్లు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండు దఫాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నాయకులు ఐక్యంగా లేకపోవడం ,అధికారపార్టీని అసెంబ్లీనూ, బయట ఇరుకునపెట్టే ఎత్తుగడల్లో ఆ పార్టీ కొంత వెనుకంజలోనే కన్పిస్తోంది. జిహెచ్ ఎంసి ఎన్నికలకు ఒక్క రోజు ముందు సిఎల్ పి నాయకుడు జానారెడ్డి ఐదు రూపాయాల భోజనం భేష్ గా ఉందని చేసిన ప్రకటన ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించింది..జానారెడ్డి వైఖరి కొంత అధికారపార్టీకి కలిసివచ్చిందనేది ఆ పార్టీ నాయకుల మనోగతంగా ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా యువ నాయకుల తరహాలో జానా మాట్లాడకపోవడాన్ని కూడ అప్పుడప్పుడూ వారు జానా దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీ జానారెడ్డి చేసే ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేదిగా ఉంటుంది. తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ మేరకు బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చులు ఉంటాయనే అంశాలపై ఆయన ఉదహారణలతో వివరిస్తున్నారు. పార్టీ సీనియర్ల మద్య ఐక్యత లేని కారణంగా పార్టీకి కలిసి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటు వచ్చిన మాజీ ఎంపి వివేక్ ఇటీవలే తిరిగి టిఆర్ఎస్ లో చేరారు. 2009 లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిగా విజయం సాధించిన టిఆర్ఎస్ లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలనే ఆయన కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య కూడ కాంగ్రెస్ పార్టీని వీడారు.గద్వాల ఎంఏల్ఏ మాజీ మంత్రి డికె అరుణ సోదరుడు, మక్తల్ ఎంఏల్ ఏ చిట్టెం రామ్మోహాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారు.జిల్లాల్లో చాలా మంది నాయకులు కూడ అధికారపార్టీలోకి పయనమయ్యారు.

ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలు

ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలు

ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో తన స్థానాలను టిఆర్ఎస్ కు అప్పగించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడ సిట్టింగ్ ఎంఏల్ఏలు మరణించడంతో ఉపఎన్నికలు వచ్చాయి. సానుభూతి ఆధారంగానైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి కూడ ఆ పార్టీకి కలిసి రాలేదు. నారాయణఖేడ్ లో కిష్టారెడ్డి, పాలేరులో రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణం తో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చనిపోయిన కుటుంబసభ్యులనే రంగంలోకి దించినా సానుభూతి పవనాలు ఆ పార్టీకి కలిసిరాలేదు.టిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటారనే పేరున్న ఖమ్మం ఎంఏల్ఏ పువ్వాడ అజయ్ కూడ పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ను వీడారు. టిఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం కూడ కాంగ్రెస్ ను ఇబ్బందికి గురించేసింది ఆ ఎన్నికల్లో. జిహెచ్ ఎం సి ఎన్నికల్లో కూడ ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి . ఆ పార్టీ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకొంది.

ఎవరికి వారే

ఎవరికి వారే

పార్టీ అధినాయకత్వం సమిష్టిగా పనిచేయని ప్రభావం కన్పిస్తోంది. అధికార పార్టీ ప్రభావంతో ఇక తమకు రాజకీయ భవితవ్యం ఉండదనే కారణంగానో చాలా మంది నాయకులు పార్టీని వీడుతున్నారు. అయితే అధికార పార్టీచేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై ఒంటి కాలిపై లేచే నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడ కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. పార్లమెంట్ కార్యదర్శుల నియామకం తో పాటు ఇతరత్రా అనేక అంశాలపై టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసిన సుఖేంర్ రెడ్డి పార్టీని వీడడం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది.

ఉత్తమ్ గడ్డం తో ప్రతిన

ఉత్తమ్ గడ్డం తో ప్రతిన

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించెవరకు తాను గడ్డం తీయబోనని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిన బూనారు. రాష్ట్రంలో టిఆర్ ఎస్ ను గద్దె దించేందుకు తాను గడ్డం తీయబోనని పిసిసి చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఎప్పుడూ షేవింగ్ చేసుకొని కన్పించే ఉత్తమ్ ఇటీవల కాలంలో గడ్డం పెంచుతూ కన్పించడంపై ఆసక్తికరమైన కథ చెప్పారు. టిఆర్ఎస్ ను గద్దె దిగే వరకు తన గడ్డాన్ని పెంచుకొంటానని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై అధికారపార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఉత్తమ్ గడ్డం పెరుగుతోంది కాని టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితులు లేవని ప్రకటించారు.

క్యాడర్ లో ఉత్సహాం కోసం కార్యక్రమాలు

క్యాడర్ లో ఉత్సహాం కోసం కార్యక్రమాలు

పార్టీ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపేందుకు ఇటీవలనే కార్యక్రమాలను ప్రారంభించింది పార్టీ నాయకత్వం. సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై సచివాలయాన్ని ముట్టడించారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. ఈ విషయమై విధ్యార్థులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు.

టిడిపికి పెద్ద షాకిచ్చిన ఈ ఏడాది

టిడిపికి పెద్ద షాకిచ్చిన ఈ ఏడాది

తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది కలిసి రాలేదు.జిహెచ్ ఎం సి ఎన్నికల్లో టిడిపికి చావుతప్పి కన్నులొట్టపోయినట్టు ఒక్క సీటును మాత్రమే గెలుచుకొంది. జిహెచ్ ఎంసి ఎన్నికలపైనే టిడిపి ప్రధానంగా ఆశలు పెట్టుకొంది.ఈ ఎన్నికల్లో మూడు రోజుల పాటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ , టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు , గ్రేటర్ పరిధిలో ఉన్న ఎంఏల్ఏలు ఈ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే ఒక్క సీటుతోనే ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ఆ పార్టీకి చెందిన గ్రేటర్ పరిధిలోని ఎంఏల్ఏలు పార్టీని వీడారు. ఎర్రబెల్లి సహా ముఖ్యులంతా టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరారు.ఈ పరిణామాలు పార్టీకి తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. 2014 ఎన్నికల్లో 15 మంది ఎంఏల్ఏలు, ఒక్క పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే రేవంత్ రెడ్డి, ఆర్ ,కృష్ణయ్య, వెంకటవీరయ్య మినహ మిగిలినవారంతా అధికార పార్టీలో చేరారు. పార్టీ పిరాయించిన ఎంఏల్ఏ ల పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించడంతో పాటు, స్పీకర్ ను కోరిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడ పార్టీని వీడారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎంఏల్ఏలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి ఎంఏల్ఏ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.90 రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ ను ఆదేశించింది.

ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలే

ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలే

జిహెచ్ ఎం సి ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడ టిడిపికి ఆశించిన ఫలితాలు రాలేదు. నారాయణఖేడ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతును ఇచ్చింది.టిడిపిలో కూడ పార్టీ నాయకుల మధ్య సమన్వయం అంతంత మాత్రంగానే ఉంది. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎల్. రమణ ల మధ్య సమన్వయం అంతంత మాత్రంగానే ఉంది. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని కొందరు సీనియర్లు తప్పుబడుతున్నారు. అయితే జిల్లాల్లో కూడ క్యాడర్ అధికారపార్టీ వైపుకు మొగ్గుచూపుతున్నారు.

క్యాడర్ లో ఉత్తేజం కోసం రేవంత్ పాదయాత్ర

క్యాడర్ లో ఉత్తేజం కోసం రేవంత్ పాదయాత్ర

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రైతుల సమస్యలపై జిల్లాల్లో ఒక్క రోజు పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలు ముగిసిన తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇదే తరహలో తెలంగాణలో పార్టీ క్యాడర్ లోఉత్తేజాన్ని నింపేందుకుగాను టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతాంగ సమస్యలపై పాదయాత్రలను నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఈ యాత్రల ద్వారా క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

బిజెపి

బిజెపి

ఈ ఎన్నికల్లో బిజెపికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జిహెచ్ ఎం సి ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకొంది. జిహెచ్ ఎంసి ఎన్నికల్లో టిడిపి తో కలిసి ఆ పార్టీ పోటీచేసింది. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానానికే పరిమితమైంది. బిజెపి మాత్రం నాలుగు స్థానాలను కైవసం చేసుకొంది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ లక్ష్హణ్ బాద్యతలను స్వీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీ శాసనసభపక్ష నాయకుడిగా బాద్యతలు స్వీకరించారు.

నాయకుల మద్య సమన్వయం

నాయకుల మద్య సమన్వయం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కొందరు నాయకులు తిరిగి పార్టీ కార్యక్రమాలకు హాజరౌతున్నారు. తెలంగాణలో తమ పార్టీని విస్తరించేందుకు ఉన్న అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవడం లేదనేది జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు పార్టీ విస్తరణ కోసం పనిచేయకపోతే తామే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించి కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని జాతీయ నాయ కత్వం హెచ్చరించింది..అయితే కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టుగా ఉన్న కొందరు నాయకులు లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా బాద్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నాగం జనార్థన్ రెడ్డి గతంలో పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహారించేవారు. కాని, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు హాజరౌతున్నారు. ఎంఏల్ఏ రాజాసింగ్ కూడ పార్టీ కార్యక్రమాల్లో కలిసివస్తున్నారు.

ఇబ్బందుల్లో లెఫ్ట్ పార్టీలు

ఇబ్బందుల్లో లెఫ్ట్ పార్టీలు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచంల స్థానం నుండి సిపిఎం తరపున సున్నం రాజయ్య, దేవర కొండ అసెంబ్లీ స్థానం నుండి సిపిఐ అభ్యర్థి రవీంద్రకుమార్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి సిపిఐ ఎంఏల్ఏ రవీంద్రకుమార్ సిపిఐ ను వీడి టిఆర్ ఎస్ లో చేరారు. దీంతో అసెంబ్లీ లో సాంకేతికంగా సిపిఐ సభ్యుడిగా ఉన్న, ఆ పార్టీ సభ్యుడు మాత్రం అధికార టిఆర్ఎస్ లో ఉంటారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 9 మంది పార్టీ నాయకులతో కలిసి మహాజన పాదయాత్ర పేరుతో యాత్రను ప్రారంభించారు. సుమారు ఐదు మాసాల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నారు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ పాదయాత్రను ఆ పార్టీ నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల్లో ,జిహెచ్ ఎంసి ఎన్నికల్లో లోక్ సత్తా, సిపిఎం పార్టీలు కలిసి పోటీచేసిన ఒక్క స్థానం కూడ దక్కలేదు. ఖమ్మం లో జరిగిన స్థానిక సంస్లల ఎన్నికల్లో కూడ లెఫ్ట్ పార్టీలకు ఆశించిన ఫలితాలు రాలేదు. మరో వైపు పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం మూడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఖమ్మం ఎంపి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆ పార్టిని వీడారు. ఆయన టిఆర్ఎస్ లో చేరారు. పొంగులేటి పార్టీని వీడడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.

తుడుచుపెట్టుకుపోయిన వైసిపి

తుడుచుపెట్టుకుపోయిన వైసిపి

తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహారించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా పార్టీని వీడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన టిఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీకి చెందిన ఎంఏల్ఏలు కొందరు అప్పటికే టిఆర్ఎస్ లో చేరారు. పార్టీతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏలు పొంగులేటి వెంట టిఆర్ఎస్ లో చేరారు.పొంగులేటి తో పాటు ఆ పార్టీకి చెందిన పినపాక ఎంఏల్ఏ పాయం వెంకటేశ్వర్లు కూడ టిఆర్ఎస్ లో చేరారు.

బలాన్ని కాపాడుకొన్న ఎంఐఎం

బలాన్ని కాపాడుకొన్న ఎంఐఎం

జిహెచ్ ఎం సి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన బలాన్ని నిలుపుకొంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ టిఆర్ఎస్ తో మిత్రపక్షంగా వ్యవహరించింది. పాతబస్తీలో ఆ పార్టీ 44 కార్పోరేటర్లను గెలుచుకొంది. ఆ పార్టీ తన బలాన్ని కాపాడుకొంది. పాత బస్తీలో కూడ ఎంఐఎం తర్వాతి స్థానాల్లో టిఆర్ఎస్ నిలిచింది. చాలా చోట్ల టిఆర్ఎస్ పైనే ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యాలయంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ కారణంగానే పాతబస్తీలో ఆ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారనే అభిప్రాయంతో అధికార పార్టీ నాయకులు ఉన్నారు.

English summary
trs advantage in every election in the 2016, opposition parties are struggle for every elction. narayankhed, paleru by elctions, ghmc, khammam, warangal, achmpet local bodies elections trs historic victory. other opposition parties struggle . strong leaders in oppostion parties join in trs. state to local leaders were join the trs. mim stable its strength in ghmc elections. tdp, congress parties get single digit seats in ghmc elections only.paleru, narayanakhed assembly seats loss the congress party in by elections.people like kcr's administration tell a survey on oct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X