కుతుబ్‌షాహీ టాంబ్స్: గార్డెన్, మ్యూజియం(ఫోటోలు)
హైదరాబాద్: చారిత్రక గోల్కోండ కోట సమీపంలో ఎడమవైపున 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుతుబ్‌షాహీ సమాధులకు పూర్వ వైభవం రానుంది. శిథిలావస్ధకు చేరుకున్న వీటి పునర్నిర్మాణ పనులు ఆగాఖాన్ ట్రస్టు ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు సమాధులు మరమ్మత్తులు పూర్తయ్యాయి.
పురావస్తు శాఖతో ఆగాఖాన్ ట్రస్టు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జరుగుతున్న ఈ పనులను పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, పురవాస్తు శాఖ డైరెక్టర్ సునీత ఎం. భాగవత్ మంగళవారం పరిశీలించారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
అనంతరం బీపీ ఆచార్య విలేకరులతో మాట్లాడుతూ 169 సంవత్సరాల పాటు పాలించి నగరంపై ప్రత్యేక ముద్ర వేసిన కుతుబ్‌షాహీ వంశస్దుల సమాధుల పునర్నిర్మాణానికి అగాఖాన్ ట్రస్టు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
ఇంకా అవసరమైతే నిధులు వెచ్చించేందుకు ట్రస్టు సిద్ధంగా ఉందన్నారు. ఈ పనులతో కుతుబ్‌షాహీ సమాధులకు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ చారిత్రక నిర్మాణాలకు ప్రపంచ స్ధాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపుతున్నట్లు ప్రకటించారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో నిధులు ప్రకటించి 25 చారిత్రక కట్టడాల్లో ఈ సమాధులూ ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రూ. 80 కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామన్నారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక స్ధలంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ మ్యూజియంను నిర్మిస్తున్నామన్నారు. పచ్చిక బయళ్లతో పూలవనంలా తీర్చిదిద్దుతామన్నారు. పనులకు సంబంధించిన వివరాలను ఆగాఖాన్ ట్రస్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ రితీష్ నంది వివరించారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
ఇప్పటికే రెండు సమాధులను అందంగా తీర్చిదిద్దగా మరో రెండింటిని సంబంధించి 90 శాతం, సుమారు 42 మీటర్ల ఎత్తు ఉన్న నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్ షా సమాధి పునర్నిర్మాణం జరుగుతోందన్నారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
ఢిల్లీ, ఆగ్రాకు చెందిన మొత్తం 40 మందితో పాటు 110 మంది కళాకారులు, కార్మికులు ఇక్కడ సమాధుల ఆకృతి పాడవ్వకుండా వాటిని చెక్కుతున్నారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
సమాధుల లోపల మెట్లతో పాటు, అలానాటి రాజులను ఖననం చేసిన ప్రాంతాలను చెక్కు చెదరకుండా భద్రపరుస్తున్నారు. బయటకు గోపురం మాదిరి చెక్కు చెదరకుండా భద్రపరుస్తున్నారు.

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గార్డెన్, మ్యూజియం
బయటకు గోపురం మాదిరి కనిపిస్తున్న కట్టడాల శిథిలాలను తొలగించి అదే నమూనాలో సున్నం, ఇసుక, కరక్కాయి, బెల్లం, కోడిగుడ్డు సొన, బంక మిశ్రమాన్ని వాడి నిర్మాణాలను చేపడుతు్న్నట్లు వెల్లడించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications