తెలంగాణాలో ఈ జిల్లాలలో వర్షాలు.. హెచ్చరిక చేసిన తీవ్ర అల్పపీడనం!

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోన సెప్టెంబర్ 3 నుండి 8 వరకు ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షాల తీవ్రత తగ్గుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు.

Telangana rains Scattered Rains Expected in Parts of Telangana as Widespread Rainfall Weakens

ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలు

మధ్య, దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై , కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు పడవచ్చు. గత వారంలో కురిసిన వర్షాలు పంటలకు మేలు చేసినప్పటికీ, ఇప్పుడు అంతా వర్ష ప్రభావం ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.

వర్షాలపై ప్రజలను అలెర్ట్ చేస్తున్న వాతావరణ శాఖ అధికారులు

ఈ క్రమంలో వర్షాలు పడే చోట వాతావరణ నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. వ్యవసాయ పనులు చేసే రైతులు వర్షాల సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు. రోడ్లపై నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు అవసరం అని చెప్తున్నారు.

చోరీ ఘటన మరువకముందే.. బొల్లారం మద్రాస్ రెజిమెంట్ క్యాంపు సమీపంలో 160 డిటోనేటర్లు.. ఆందోళన!
చోరీ ఘటన మరువకముందే.. బొల్లారం మద్రాస్ రెజిమెంట్ క్యాంపు సమీపంలో 160 డిటోనేటర్లు.. ఆందోళన!

వాతావరణ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి

మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో ఈసారి ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. అడపా దడపా వర్షాలు తప్ప పెద్దగా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని, వర్షాలు పడినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైనా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+