మంత్రి సబిత, అధికారులకు గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్ ఖరారు

హైదరాబాద్: యూనివర్సిటీల ఉమ్మడి నియామకాల బిల్లుపై సందేహాలు నివృత్తి చేయాలన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు చేసిన క్రమంలో సమయం కోరిన విద్యాశాఖ మంత్రి, అధికారులకు రాజ్‌భవన్ అపాయింట్ మెంట్ ఖరారు చేసింది.

గురువారం సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ అధికారులు కలిసేందుకు రావాచ్చని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన వర్సిటీ ఉమ్మడి నియామకాల బిల్లును ఆమోదించకుండా గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో సందేహాలు నివృత్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ భవన్ లేఖ రాసింది.

Telangana raj bhavan appointment for minister sabitha indra reddy and education officials

అయితే, తనకింకా లేఖ అందలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. మరోవైపు, నిన్న గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. బిల్లులు పంపగానే ఆమోదం తెలపలా? దాన్ని పరిశీలించాల్సిన, అధ్యాయనం చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.

తనకు బిల్లులపై సందేహాలుంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు గవర్నర్. అన్ని రకాలుగా పారదర్శకత ఉంటూనే బిల్లులను ఆమోదించడం జరుగుతుందన్నారు. మరోవైపు, బిల్లులపై సందేహాలుంటే తాము గవర్నర్ ను కలిసి నివృత్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలోనే అపాయింట్‌మెంట్ కోరగా.. రాజ్ భవన్ ఖరారు చేసింది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు గురువారం సాయంత్రం గవర్నర్ తమిళిసైని కలిగి.. బిల్లుపై ఉన్న సందేహాలపై చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+