హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదట్లో కేసీఆర్ మంచి సీఎంగా ఉన్నారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రాహుల్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి బుధవారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. ఆయన బుధవారం తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు మూడు పేజీల రాజీనామా లేఖను రాశారు. ఈ నెల 23వ తేదీన యూపీఐ చైర్ పర్సన్ సోనియా గాంధీ బహిరంగ సభ మేడ్చల్‌లో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్‌లో చేరుతారు.

Recommended Video

Telangana Elections 2018 : మేడ్చల్‌లో ఈ నెల 23న సోనియా గాంధీ సభ, కోదండ ఆవేదన | Oneindia Telugu

ఇద్దరు కాదు.. ముగ్గురు: మళ్లీ రేవంత్ సంచలనం వ్యాఖ్యలు, విశ్వేశ్వర్ రెడ్డి ఊహించని ట్విస్ట్ఇద్దరు కాదు.. ముగ్గురు: మళ్లీ రేవంత్ సంచలనం వ్యాఖ్యలు, విశ్వేశ్వర్ రెడ్డి ఊహించని ట్విస్ట్

రాహుల్ గాంధీతో భేటీ అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. తాను వ్యక్తిగత కారణాలతో తెరాసకు రాజీనామా చేయలేదని చెప్పారు. ఆ పార్టీ సిద్ధాంతాలలో వచ్చిన మార్పులు ప్రజలకు అనుగుణంగా లేవని, వాటి కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు.

నియోజకవర్గ సమస్యలు చర్చించా

నియోజకవర్గ సమస్యలు చర్చించా

నియోజకవర్గ సమస్యల గురించి తాను రాహుల్ గాంధీతో చర్చించానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్‌, వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ తదితర సమస్యల గురించి వివరించానని తెలిపారు. అనివార్య కారణాల వల్ల తాను టీఆర్ఎస్ పార్టీకి పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. తాను ఆ పార్టీలో చేరినప్పటి నుంచి కొందరితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని చెప్పారు. అంతమాత్రాన పార్టీను ఎందుకు వీడుతానని అన్నారు.

తొలుత కేసీఆర్ మంచి సీఎంగా పని చేశారు కానీ

తొలుత కేసీఆర్ మంచి సీఎంగా పని చేశారు కానీ

నేతలతో విభేదాల వంటి చిన్న చిన్న కారణాల వల్ల తాను పార్టీని వీడే రకం కాదని కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ తొలుత ఓ మంచి సీఎంగా పని చేశారని కితాబిచ్చారు. కానీ ఆ తర్వాత, గత రెండేళ్లుగా తాను పార్టీలో ఉండి పోరాడుతున్నానని చెప్పారు. తద్వారా రెండేళ్లుగా పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అన్నారు. ప్రాంతీయ పార్టీలతో సమస్యల పరిష్కారం సాధ్యం కావడం లేదన్నారు.

కాంగ్రెస్‌తో సమస్యలకు పరిష్కారం

కాంగ్రెస్‌తో సమస్యలకు పరిష్కారం

తన నియోజకవర్గంలో తెరాస హామీలు అమలు కాలేదని కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని చెప్పారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెరాస పని చేస్తోందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో కార్యకర్తలకు తెరాస దూరమైందని చెప్పారు. యువకులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు, టీఎన్జీవోలు, నిరుద్యోగులు అంతా తెరాసకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.

ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా

ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా

వికారాబాద్ సాటిలైట్ సిటీగా కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందని, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. పంటలకు సాగునీరు, ఎంఎంటీఎస్, తాండూరు సమస్యలు, వికారాబాద్ సాటిలైట్ సిటీ ఇవన్నీ కాంగ్రెస్ పూర్తి చేస్తుందని భావిస్తున్నానని చెప్పారు. తెరాసలో ప్రజాస్వామ్యం లేదన్నారు. తాను మహేందర్ రెడ్డితో వివాదం కారణంగా పార్టీని వీడలేదని చెప్పారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. లోకసభ స్పీకర్‌ను కలిసి రాజీనామా ఇస్తానని చెప్పారు.

కొండా చేరికపై రాహుల్ గాంధీ సంతోషం

కొండా చేరికపై రాహుల్ గాంధీ సంతోషం

23న మేడ్చల్‌ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని కుంతియా తెలిపారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం సంతోషకరమన్నారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం విశ్వేశ్వర్ రెడ్డి పని చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని చెప్పారు. చాలామంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పారు. కొండా పార్టీలో చేరడం పట్ల రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారన్నారు. మజ్లిస్ పార్టీతో, బీజేపీతో చేతులు కలిపిన తెరాస లౌకికవాద పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

English summary
Konda Vishweshwar Reddy met Congress Chief Rahul Gandhi in Delhi a day after his resignation from K Chandrasekhar Rao's (KCR) Telangana Rashtra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X