Telangana: మున్సిపాల్టీల్లో ఎక్స్ ఆఫీషియో ఓటు వారికే..! తేల్చేసిన ఈసీ..!
తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (telangana municipal eletion results) వెలువడ్డాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 74 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పోరేషన్లలో విజయంసాధించింది. బీఆర్ఎస్ 17 చోట్ల గెలిచింది. మరో 24 చోట్ల ఎవరికీ మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో ఆయా స్థానిక సంస్థలను దక్కించుకోవాలంటే అధికార, విపక్షాలకు ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ పీఠాల పోరులో ఎక్స్ అఫీషియో సభ్యులెవరో ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణ మున్సిపాలిటీలో చట్టం-2019 ప్రకారం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఎవరికి ఉంటుందో తెలియజేస్తూ ఎస్ఈసీ రాణికుముదిని ఓ ప్రకటన చేశారు. ఇందులో రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు హక్కు తప్పనిసరి అని తెలిపారు. అలాగే ఆయన మున్సిపాలిటీలు, లేదా కార్పోరేషన్ పరిధిలో ఓటరుగా నమోదు కానివారు ఓటు వేసేందుకు అనర్హులని ఆమె పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాలిటీలు ఎక్స్ అఫీషియా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎస్ఈసీ తెలిపారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మాత్రం తమకు ఓటు హక్కు ఉన్న చోట మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ ఎక్స్ అఫీషియో ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఇవాళ్టి వరకూ ఎస్ఈసీ గడువునిచ్చారు. దీంతో వారంతా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు నమోదుకు బయలుదేరుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications