తెలంగాణలో ఖాళీ స్థానాలకు ఎస్ఈసీ షెడ్యూల్: ఏప్రిల్ 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సిద్ధమైంది. ఆయా చోట్ల ఓటరు జాబితా తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఏప్రిల్ 4న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 34 ఎంపీటీసీ స్థానాలు, 99 సర్పంచ్, 2004 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు ఎస్ఈసీ తెలిపింది. 20 గ్రామ పంచాయతీల్లో అన్ని పదవులు ఖాళీగా ఉన్నాయని ప ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలుకానుంది. మరోవైపు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే.