ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!
విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఈ రోజు (బుధవారం) నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కరెంటు కేటగిరీల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు. దీని ద్వారా కొత్త ఆర్దిక సంవత్సరంలో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు.
తెలంగాణలో ఈ రోజు నుంచి విద్యుత్ ఛార్జీల్లో మార్పు చేసారు. రాష్ట్రంలో హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి డిమాండ్ లేని సమయంలో విద్యుత్తు వినియోగానికి ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)'కి ప్రతిపాదించాయి. కాగా, డిమాండ్ లేని సమయంలో ప్రధానంగా సౌర విద్యుత్తు అందుబాటులోకి వచ్చినప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కరెంటును వినియోగిస్తే యూనిట్‌కు 50పైసల రాయితీ ఇస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రాయితీ రూ.1 ఉండగా.. కొన్ని నెలల కింద డిస్కమ్‌లు దాన్ని నిలిపివేశాయి. తాజా ఆర్థిక సంవత్సరం పిటిషన్లపై విచారణ సందర్భంగా పారిశ్రామిక వర్గాలు గణాంకాలతో సహా వివరించడంతో ఈఆర్‌సీ టైమ్ ఆఫ్ డే (టీవోడీ- డిమాండ్ లేని సమయంలో రాయితీ, డిమాండ్ ఉన్న సమయంలో అదనపు చార్జీల వసూలు) రాయితీని పునరుద్ధరించింది. గతంలో రూ.1గా ఉన్న రాయితీని 50 పైసలు చేసింది. అలాగే డిమాండ్ అధికంగా(పీక్) ఉన్న సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య, మళ్లీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యుత్తు వినియోగానికి అదనంగా రూ.1.50 చార్జీ విధించింది.

తాజా మార్పులు.. నేటి నుంచి అమలు
అయితే, గతంలో ఇది రూ.1గా ఉండేది. ఇక రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల దాకా (ఈఆర్‌సీ ఖరారు చేసిన) సాధారణ చార్జీలను వర్తింపజేయనున్నారు. ఇవి హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి అమలు కానున్నాయి. మరోవైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను డిస్కమ్‌లు రూ.72,996 కోట్ల వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్) ఉన్నట్లు ప్రతిపాదనలు సమర్పించగా.. అభ్యంతరా ల స్వీకరణ, బహిరంగ విచారణ అనంతరం ఈఆర్‌సీ ఆ మొత్తాన్ని రూ.64,950కోట్లకు కుదించింది. కాగా.. ఏ విభాగంలోనూ విద్యుత్తు చార్జీలను పెంచలేదు. ఇది సామాన్య వినియోగ దారుడికి రిలీఫ్ గా మారుతోంది. దీని ద్వారా 2026-27లోనూ పాత చార్జీలే అమలు కానున్నాయి. ఈ మేరకు 2026-27కు గాను ఈఆర్‌సీ టారిఫ్ ఉత్తర్వులను విడుదల చేసింది. రెవెన్యూ లోటును రూ.22,104కోట్లుగా చూపించగా.. రూ.14,059కోట్లకు కుదించింది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!













Click it and Unblock the Notifications