వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

98.31 ఆవాసాలకు నల్లాలతో సురక్షిత మంచినీరు, దేశంలోనే తెలంగాణకు తొలి స్థానం: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

ఇంటింటికీ మంచినీరు అందించడాన్ని కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ భగీరథ పేరుతో పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు మంచినీరు అందిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జల్ జీవన్ మిషన్ వివరాలు ప్రకటించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 98.31 శాతం ఆవాసాలకు తాగునీరు అందిస్తూ దేశంలో తొలిస్థానంలో నిలిచామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 54.38 ఆవాసాలు ఉండగా.. 54.46 లక్షల ఇళ్లకు తాగునీరు చేరుతుందని వెల్లడించారు. తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని.. తర్వాత స్థానంలో 89.05 శాతంతో గోవా ఉందని వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ పోస్ట్ చేశారు.

telangana state first place on drinking water supply: ktr

98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు అందిస్తుంది. మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందుతోంది. అద్భుత విజయానికి గౌరవ సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేచేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ టీమ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

87.02 శాతంతో పుదుచ్చేరి మూడు.. 79.61 శాతంతో హర్యానా నాలుగు, 73.85 శాతంతో గుజరాత్ ఐదో స్థానాల్లో నిలిచాయి. 34.62తో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది. 1.86 శాతంతో మేఘాలయా చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకుంది.

English summary
telangana state first place on pure drinking water supply minister ktr said. govt of india's ministry of jal shakti reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X