నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ..హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇది గుడ్ న్యూస్. నీతిఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) ఇండియా ఇండెక్స్ 2019లో రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అసమానత్వం తొలగించడం, వృద్ధి నమోదు చేయడం వంటి కేటగిరీల్లో తెలంగాణ తొలిర్యాంకును సాధించిందని నీతి ఆయోగ్ పేర్కొంది. మొత్తంగా ఆర్థికవృద్ధి కేటగిరీలో తెలంగాణకు 82 పాయింట్లురాగా సమానత్వం కేటగిరీలో 94 పాయింట్లు సంపాదించింది. మొత్తం 28 రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది.
పేదరిక నిర్మూలన, ఆకలి సమస్యలు, ఆరోగ్యం, నాణ్యతతో కూడిన విద్య, లింగ సమానత్వం, తాగునీరు మరియు పరిశుభ్రత, డీసెంట్ వర్క్ మరియు ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, ఇన్నోవేషన్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అసమానత్వం, స్థిరమైన నగరాలు మరియు వర్గాలు, స్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి, వాతావరణం, శాంతి వంటి పారామీటర్లను పరిగణలోకి తీసుకుని ఎస్‌డీజీ ఇండెక్స్ స్కోర్లను ఇచ్చింది. ఈ మొత్తం కేటగిరీల్లోని రెండు కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్, కర్నాటకల కంటే ఎక్కువ పాయింట్లు సాధించింది తెలంగాణ. ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌కు 78 పాయింట్లు రాగా తెలంగాణకు 82 పాయింట్లు వచ్చాయి.

ఇక అసమానత్వం తొలగింపులో మణిపూర్(81), హిమాచల్ ప్రదేశ్ (78)లను దాటి తెలంగాణ 94 పాయింట్లు సాధించింది. తెలంగాణ మణిపూర్‌ల మధ్య వ్యత్యాసం 13 పాయింట్లు. ఇక అన్ని విభాగాలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 28 రాష్ట్రాల్లో తెలంగాణ 67 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో కేరళ నిలవగా రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. అయితే ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలతో మూడో స్థానం పంచుకుంది.
నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రెండు పారామీటర్లలో అగ్రస్థానంలో నిలవడం... ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలవడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. గత సంత్సరాలకంటే తెలంగాణ ఈ సారి మరింత మెరుగుపడిందన్నారు. గతేడాది తెలంగాణ స్కోరు 61 ఉండగా ఈ సారి 67 స్కోరు సాధించడం ఆనందం కలగజేస్తోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications