Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ to అరుణాచలం.. 4 రోజుల ట్రిప్.. ఇంత తక్కువ ధరకే..

దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం ముఖ్యమైనదిగా చెబుతుంటారు. నిత్యం లక్షలాదిమంది భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు విశేషమైన గుర్తింపు ఉంది. పంచ భూత లింగాలలో ఒకటైన అరుణాచం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు లక్షలాది మంది తరలివస్తారు. ఇక అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం వస్తుంది. అంటే ఎర్రని కొండ అని సమాధానం. అదే తమిళంలో అయితే 'తిరువన్నామలై' అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా కొలుస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు అరుణాచలం సందర్శిస్తుంటారు.

అయితే అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందుకు సంబంధించి సెప్టెంబర్ నెల తేదీలను తాజాగా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులకు తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చేలా తెలంగాణ టూరిజం ప్రణాళికలు రచించింది. ఈ ప్యాకేజీని గత కొంతకాలంగా నిర్వహిస్తూ వస్తోంది. తెలంగాణ టూరిజం బోర్డు నెలల వారీగా తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది.

ఇక HYDERABAD - ARUNACHALAM టూర్ మొత్తం 4 రోజుల పాటు సాగుతుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో 4 సార్లు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. హైదరాబాద్ నుంచి సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అరుణాచలానికి బస్సు బయల్దేరుతుంది. ఈ తేదీలకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/tours వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

Telangana Tourism Unveils September Dates for Hyderabad-Arunachalam Tour Package

నాలుగు రోజుల టూర్ లో భాగంగా తొలి రోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతుంది. అలా కాణిపాకం వెళ్లి అక్కడి నుంచి అరుణాచలం చేరుకుంటుంది. అరుణాచలంలో దర్శనం తర్వాత వేలూర్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ను కూడా దర్శించుకోవచ్చు. నాలుగో రోజు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఇక ఈ టూర్ ప్యాకేజీ ధరలు పెద్దలకు ఒక్కో టికెట్ ధర రూ. 8,000 గా ఉంది. పిల్లలు అయితే రూ. 6400 గా ఫిక్స్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+