వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్ వ్యాప్తితో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణా గ్రామం; నిర్ణయం వెనుక పెద్దకథ!!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం ప్రపంచాన్ని మరోమారు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ కేసుల నమోదు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఓ గ్రామం పది రోజులపాటు సెల్ఫ్ లాక్ డౌన్ ను ప్రకటించింది. పది రోజులపాటు ప్రజలెవరూ బయటకు రావద్దని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఎవరిని గ్రామంలోనికి రానివ్వ వద్దని నిర్ణయం తీసుకున్నారు.

ఒమిక్రాన్ భయాల మధ్య క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం; ఢిల్లీ సర్కార్ కీలక ఉత్తర్వులుఒమిక్రాన్ భయాల మధ్య క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం; ఢిల్లీ సర్కార్ కీలక ఉత్తర్వులు

తెలంగాణాలో స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న గ్రామం

తెలంగాణాలో స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న గ్రామం

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మొట్టమొదటిసారిగా తెలంగాణా రాష్ట్రంలో ఒక గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను ప్రకటించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవల ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఇటీవల గల్ఫ్ నుండి వచ్చిన వ్యక్తికి మూడు రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కాగా దుబాయ్ నుండి వచ్చిన ఆ వ్యక్తిని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఒమిక్రాన్ వేరియంట్ తో బాధ పడుతున్నాడని గుర్తించి అతడికి వైద్య సేవలు అందిస్తున్నారు.

దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ .. శుభాకార్యంలో పాల్గొన్న బాధితుడు, అధికారులు అలెర్ట్

దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ .. శుభాకార్యంలో పాల్గొన్న బాధితుడు, అధికారులు అలెర్ట్


ఇక తాజాగా అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తుంది. వారి నమూనాలను సైతం జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. బాధితుడు కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురంలో ఒక శుభకార్యంలో పాల్గొన్నాడు. దీంతో అతనితో కలిసిన వారందరి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ శుభకార్యంలో పాల్గొన్న 53 మంది నమూనాలను సేకరించిన వైద్య శాఖ అధికారులు వారిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.

గూడెం గ్రామంలో స్వచ్చంద లాక్ డౌన్, గ్రామపంచాయతీ తీర్మానం

గూడెం గ్రామంలో స్వచ్చంద లాక్ డౌన్, గ్రామపంచాయతీ తీర్మానం

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో గూడెం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పది రోజుల పాటు ఎవరు బయటకు రావద్దని, కొత్తవారిని గ్రామంలోకి అనుమతించవద్దని సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. పది రోజుల పాటు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకుంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 38 కేసులు నమోదైనట్లు గా తెలుస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా వైద్య అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ ..

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ ..

ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 కేసులలో ఆరుగురు మాత్రమే హైరిస్క్ దేశాలనుంచి వచ్చిన వారు కాగా, మిగతావారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాలనుంచి వచ్చిన వారు ఉన్నారని సమాచారం. వీరంతా కెన్యా, సోమాలియా, బ్రిటన్, దోహా, అబుదాబి లాంటి దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారే కావడం గమనార్హం. ఒకపక్క ఒమిక్రాన్ వేరియంట్ శర వేగంగా వ్యాపిస్తుంది అన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన రక్షణ చర్యలను చేపట్టింది

Recommended Video

Sankranthi: Trains, Buses ఫుల్ .. ఇక Extra Charges మోతే
 క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణా హైకోర్టు ఆదేశాలు

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణా హైకోర్టు ఆదేశాలు

ఇక తెలంగాణ హైకోర్టు కూడా రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశాలు జారీ చేసింది. జనం గుంపులుగా గుమికూడి కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలో కి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని పేర్కొంది.

English summary
For the first time in the state of Telangana, people have voluntarily announced a lockdown in Gudem village in Mustabad zone of Rajanna Sirisilla district due to the Omicron variant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X