హైకోర్టును విభజించాల్సిందే: జితేందర్, కసరత్తు జరుగుతోందన్న వెంకయ్య

న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిందేనని టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లోకసభలో స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన లోకసభ సమావేశాల్లో మాట్లాడుతూ.. హైకోర్టు విభజనపై ఇప్పటికే కేంద్రమంత్రులను ఎన్నోసార్లు కలిశామని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుక కూడా హైకోర్టును విభజించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. హైకోర్టును విభజించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు. హైకోర్టు విభజన కోసం పోరాటాలు జరుగుతున్నాయని చెప్పారు.

Telangana wants separate High Court, says MPs Jithender Reddy, Vinod

కేంద్రం కావాలని హైకోర్టు విభజనను జాప్యం చేస్తోందని ఎంపి జితేందర్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టును వెంటనే విభజించాలని మరో ఎంపి వినోద్ అన్నారు. హైదరాబాద్ ఏసి సిఎం, సచివాలయం, డిజిపి ఉన్నప్పుడు ఏపి హైకోర్టు ఉంటే సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వెంటనే తెలంగాణ, ఏపిలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు విభజనపై కసరత్తు జరుగుతోంది: వెంకయ్య

తెలంగాణ ఎంపీలు చేసిన డిమాండ్లలో న్యాయం ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు కూడా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు. తెలంగాణ, ఏపిలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుందని వెంకయ్య తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+