తెలంగాణలో కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరు..ఆయనకే ఛాన్స్..!

తెలంగాణ ప్రస్తుత ఏజీ BS ప్రసాద్ రాజీనామా నేపథ్యంలో కొత్తగా అడ్వకేట్ జనరల్ ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది..తెలంగాణ ఉద్యమంతో పాటు సమర్థత,విశ్వసనీయతలకు పెద్ద పీట వేస్తూ అడ్వకేట్ జనరల్ ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది..తెలంగాణ వచ్చిన తొమ్మిదన్నర ఏండ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది
ఏజీ రాజీనామా ఆమోదం పొందితే జీపీ,ఏజీపీల నియామకాలన్నీ రద్దు అయ్యి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం లభిస్తుంది.

ప్రభుత్వానికి న్యాయస్థానంలో వెన్నుదన్ను లాంటి వ్యక్తి అడ్వకేట్ జనరల్, ఎన్నో కీలకం అయిన కేసులు న్యాయ స్థానం ముందుకు వచ్చినపుడు ప్రభుత్వం తరుపున వాదనలను గట్టిగా వినిపించాల్సిన భాధ్యత అడ్వకేట్ జనరల్‌ది.అందుకే ఈ నియామకం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రభుత్వ పరిశీలనలో ఉన్న పేర్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు చల్లా దామోదర్ రెడ్డి.గత మూడు దశాబ్ధాల కాలంలో తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ ని నెలకొల్పడం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లీగల్ సెల్ అద్యక్షునిగా సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వహించడం,తెలంగాణ మొట్టమొదటి లీగల్ సెల్ అధ్యకునిగా ఉండడం ఆయనకి కలిసి వచ్చే అంశాలు.

Telangana:Who is the new Advocate general, Challa Damodar reddy name making rounds for the post

అంతేకాకుండా మొట్టమొదటి ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా ఉండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ ను ఎత్తివేస్తే దానిని హైకోర్టులో సవాలు చేసి దర్నాచౌక్‌ను కాపాడిన వ్యక్తిగా అందరూ అనుకోవడం, అంతే కాకుండకాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్విజయ్‌సింగ్, అప్పటి కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్, కొప్పులరాజు, యువజన కాంగ్రెస్ నాయకులపై అలాగే ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి పై గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను విజయవంతంగా నిరోధించడం దామోదర్ రెడ్డికిఅనుకూల అంశాలుగా ఉన్నాయి.

అడ్వకేట్ జనరల్‌గా చల్లా దామోదర్ రెడ్డి పేరు తో పాటు నిరూప్ రెడ్డి, దేశాయ్ ప్రతాప్ రెడ్డి, పొన్నం అశోక్ గౌడ్, గిరిధర్ రావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి, కానీ దామోదర్ రెడ్డి గతంలో పీసీసీ లీగల్ సెల్ కి ఛైర్మెన్ గా ఉండడం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయడం, విశ్వసనీయత, సమర్థత లను బేరీజు వేసుకుని చల్లా దామోదర్ రెడ్డికే అడ్వకేట్ జనరల్‌గా అవకాశం ఇచ్చేలా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+