నాడు కుమారుడి కోసం స్కూటీపై 1400 కి.మీ ప్రయాణం..నేడు ఉక్రెయిన్ నుంచి రాక కోసం ఎదురుచూపులు

మాస్కో: కొద్దిరోజులుగా రష్యా ఎడతెరిపి లేకుండా చేస్తోన్న యుద్ధం వల్ల ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా సైనిక బలగాలనకు ఎదురొడ్డి నిలుస్తోంది. తమ దేశాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. అయినప్పటికీ- రష్యా దూకుడును నిలువరించేలేకపోతోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా పట్టు సాధించింది. కొన్ని కీలక నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. రాజధాని కీవ్‌పై పట్టుబిగించడానికి రష్యా సైనికులు భీకరదాడులను చేస్తోన్నారు. ఉక్రెయిన్- దీన్ని తిప్పి కొట్టే ప్రయత్నాల్లో ఉంటోంది.

ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో వేలాదిమంది భారత విద్యార్థులు, సాధారణ పౌరులు చిక్కుకుపోయారు. కీవ్, ఖార్కీవ్, సుమి, మరియొపొల్, ల్వీవ్ వంటి నగరాల్లో వారంతా బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ గంగాను చేపట్టింది. ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగో వంటి పౌర విమానాలతో పాటు వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ రంగంలోకి దింపింది. ఇప్పటిదాకా వేలమందిని స్వదేశానికి చేర్చింది.

Telangana Woman Razia Begum who rode 1400 km to rescue son now awaits his return from Ukraine

ఉక్రెయిన్ పొరుగు దేశాలు- హంగేరి, పోలెండ్, హాలెండ్, స్లొవేకియా, రొమేనియా, మోల్డొవాల మీదుగా వారంతా భారత్‌కు చేరుకుంటోన్నారు. కాగా- తెలంగాణలోని బోధన్‌కు చెందిన ఒంటరి మహిళ రజియా బేగం కూడా తన కుమారుడి కోసం ఎదురు చూస్తోన్నారు. ఆమె కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ అమన్.. ఇప్పుడు సుమిలో చిక్కుకుపోయాడు. అతను సుమీ స్టేట్ యూనివర్శిటీలో తొలి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి.

2020లో లాక్‌డౌన్ సమయంలో రజియాబేగం పేరు మారుమోగి పోయిన విషయం గుర్తుండే ఉంటుంది. నెల్లూరులో చిక్కుకుపోయిన తన కుమారుడిని తీసుకుని రావడానికి బోధన్ నుంచి ఒంటరిగా స్కూటీపై నెల్లూరుకు వెళ్లారామె. తన కుమారుడిని తీసుకుని సురక్షితంగా బోధన్‌కు చేరుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన ఈ సాహసకృత్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1,400 కిలోమీటర్ల దూరం స్కూటీపై ఆమె చేసిన ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Woman Razia Begum who rode 1400 km to rescue son now awaits his return from Ukraine

నెల్లూరులో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న అమన్.. ఉక్రెయిన్‌లోని సుమి యూనివర్శిటీలో మెడికల్ సీటును సాధించాడు. తొలి సంవత్సరం ఎంబీబీఎస్‌లో జాయిన్ అయ్యాడు. రష్యా జరుపుతోన్న దాడుల వల్ల అక్కడే చిక్కుకుపోయాడు. అతని కోసం రజియా బేగం ఎదురు చూపులు చూస్తోంది. అమన్ తనతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, తాను క్షేమంగా ఉన్నానంటూ ధైర్యం చెబుతున్నాడని రజియాబేగం అన్నారు. 800 మంది తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్ బేస్‌మెంట్‌లో తలదాచుకుంటున్నాడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+