వేణు స్వామికి మహిళాకమీషన్ నోటీసులు..నాగచైతన్య, శోభితల జ్యోతిష్యం దెబ్బ!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, నిశ్చితార్ధం చేసుకున్న మహిళను కించపరిచేలా, అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.

వేణు స్వామిపై మహిళా కమీషన్ కు ఫిర్యాదు
నాగచైతన్య శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం తర్వాత వారి వివాహ జీవితంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్. ఇక సోషల్ మీడియాలో సినీ సెలెబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి ఎపిసోడ్లో ఆయన పైన ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది.

Telangana Women Commission notices to Venu Swamy Naga Chaitanya Sobhita dhulipala astrology effect

తప్పుడు జ్యోతిష్య విశ్లేషణలతో అభాసు పాలైన వేణు స్వామి
ఇక ఈ వ్యవహారంలో వేణు స్వామి భార్య వీడియో రిలీజ్ చేసి మీడియాను టార్గెట్ చేయటంతో సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి పైన, వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి పైన కూడా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఇంకా పెళ్లి కూడా చేసుకోకముందే వాళ్ళు ఎప్పుడు విడిపోతారో చెప్పిన వేణు స్వామి గతంలోనూ అనేక సందర్భాల్లో తప్పుడు జ్యోతిష్య విశ్లేషణలు చెప్పి అభాసు పాలయ్యారు.

జాతకాలు చెప్పనని చెప్పి మళ్ళీ కాంట్రవర్సీలు మొదలెట్టిన వేణు స్వామిపై ఫిర్యాదు
గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి చంద్రబాబు గెలిచిన తర్వాత మళ్లీ తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని పేర్కొన్న వేణు స్వామి తాజాగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ల విషయంలో చేసిన వ్యాఖ్యలు పలువురు మహిళల,కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులకు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయన పైన తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నీరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు.

సమన్లు జారీ చేసిన మహిళా కమీషన్ .. కమీషన్ ముందు హాజరుకావాలని ఆదేశం
దీంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద వేణు స్వామి పైన ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీలలో భాగంగా వేణు స్వామికి నోటీసులు జారీ చేశారు. మహిళా కమీషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద సమన్లు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+