షాక్: హరీష్‌రావు మొబైల్ పోయింది, ఫోన్‌ కోసం మంత్రి ఏం చేశాడంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సెల్‌ఫోన్ పోయింది. గురువారం నాడు కన్నెపల్లి పంప్‌హౌజ్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సమయంలో మంత్రి హరీష్‌రావు పోగొట్టుకొన్నారు.

గురువారం కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన తిరిగి వెళ్తూ తన మొబైల్‌ను పోగొట్టుకున్నారు. అయితే కొంత సేపటి తర్వాత మంత్రి తన ఫోన్‌ పోగొట్టుకొన్న విషయాన్ని గుర్తించారు.

Telangna minister Harish rao lost his mobile

అయితే తాను కారులో తిరిగి కన్నెపల్లి పంప్‌హౌజ్ ప్రాంతానికి చేరుకొన్నారు. కారు దిగి స్వయంగా ఫోన్ కోసం చాలాసేపు వెతికారు. ఆయనకు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అధికారులు సాయం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించి వెళ్తున్న సమయంలో హరీశ్ తన మొబైల్‌ను పోగొట్టుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana state Irrigation minister Harish Rao lost his Cell Phone on Thursday at Kannepally pump house.When Harish Rao identified his mobile gone missing after he returning pump house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X