సమ్మక్క సారక్క జాతరలా తెలుగు మహా సభలు
Recommended Video

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...ఖమ్మం నుండి వచ్చిన భాషా పండిట్ మాట్లాడుతూ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఇక్కడంత సమ్మక్క సారక్క జాతరలా సందడిగా వుంది. తెలుగు భాషకు దక్కిన గౌరవం ఇది. పిల్లలకు ముందు నుండే తెలుగుని పరిచయం చెయ్యాల్సిన అవసరం వుంది అంటూనే, ఈ ఐదు రోజుల్లో కొన్ని అవకతవకలు వున్నా పెద్దగా పట్టించుకోవాల్సినవెం కాదు. అంటు చక్కటి తెలుగు పద్యాన్ని పాడి అర్ధాన్ని వివరించారు.












Click it and Unblock the Notifications