ఆహార కల్తీలో టాప్‌లో తెలుగు రాష్ట్రాలు.. ఏ ఏ స్థానాల్లో అంటే ?

ఒకవైపు వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది. మరోవైపు కట్టడి లేని కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో.. వాటిని నిల్వ చేయడంలో.. ప్యాకింగ్‌లో.. తయారీ కోసం నూనెలు, కారం పొడి, పిండి పదార్థాలు, పసుపు, మసాలా లాంటివి అన్ని ప్రస్తుతం కల్తీ అవుతూనే ఉన్నాయి.
మహానగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి.

ఎక్కడపడితే అక్కడ బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు రాత్రి, పగలు అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటున్నాయి. ఇక సిటీల్లో అయితే ఇంట్లో వంటలకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ బయటే కానిచ్చేసే వారు ఎందరో ఉన్నారు. మందుబాబులకు అయితే చెప్పాల్సిన పనే లేదు. ఏం తింటున్నాం.. ఏం తాగుతున్నాం అనే విషయం కూడా వారికి ఆలోచనకు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే అదనుగా చేసుకొని నాణ్యతను పట్టించు కోకుండా అడ్డగోలుగా ఆహార పదార్ధాలను కల్తీ చేసేస్తున్నారు.

telugu-states-are-top-in-food-adulteration-in-which-positions

ఈ క్రమంలోనే 2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉండటం అందరికీ షాక్ ఇస్తుంది. ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి.

ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. 14 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఇక ఆ తర్వాత 13.11 శాతంతో కేరళ.. 9 శాతంతో ఆంధ్రప్రదేశ్.. 6.30 శాతంతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఈ లెక్కలు చూసి ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిబంధనలకు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. లైసెన్సుల జారీ విషయంలోనే మరింతగా నియమాలు అమలు చేయాలని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+