పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మారనుందా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం యానివర్సిటీ పేర్లను మారుస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలుగు యూనివర్సిటీపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయా విశ్వవిద్యాలయానికి ఫ్రోపెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సామాజిక చరిత్రకారుడైన సురవరం ప్రతారపెడ్డి పేరు పెట్టాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. సీఎం కేసీఆర్ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చే దానిపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మహబాబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న జన్మించారు. నిజాం కాలేజీ నుంచి ఎఫ్‌ఏ కోర్సును, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బీఏ, బీఎల్ పూర్తి చేసిన ఆయన కొంతకాలం పాటు లాయర్‌గా విధులు నిర్వర్తించారు.

Telugu University may be renamed after Suravaram

ఆయన రచించిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' పుస్తకం తెలుగులో ప్రచురితమైన మొదటి పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. ఈ రచనకు గానూ ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. తెలంగాణ అన్నా, తెలుగు బాష అన్నా ఆయనకు ఎంతో మక్కువ.

ముఖ్యంగా తెలంగాణ భాషపై ఆయనకు ఎంతో పట్టు ఉంది. 'గోల్కొండ కవులు' అనే పేరుతో కవితలు రాసి తెలంగాణలో కూడా సాహిత్యం, కవిత్యం ఉందని తెలియజెప్పారు. 1920-48 వరకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేశారు.

గోల్కొండ పత్రికను స్దాపించి సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభించిన నాటి ఆంధ్ర మహాసభకు మొదటి అధ్యక్షుడుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+