దుబ్బాకలో ఉద్రిక్తత: బస్టాండ్ ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ; కొనసాగుతున్న టెన్షన్
దుబ్బాక లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో గోడౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవం నేపద్యంలో ఇరు పార్టీల మధ్య చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు గోడౌన్ ప్రారంభోత్సవం చేస్తుండగా బిజెపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడంతో మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పాల్సి వచ్చింది.

దుబ్బాక బస్టాండ్ పై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
అసలు ఇంతకీ బిజెపి, బి ఆర్ ఎస్ మధ్య చోటు చేసుకున్న బస్టాండ్ వివాదం విషయానికి వస్తే ఉప ఎన్నిక సమయంలో కొత్త బస్టాండు నిర్మిస్తామని అధికార బి ఆర్ ఎస్, ప్రతిపక్ష బిజెపి రెండు ప్రజలకు హామీ ఇచ్చాయి. ఇక తాజాగా నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఏడాదిన్నర కాలంలోపే అన్ని హంగులతో బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతేకాదు నేడు మంత్రి హరీష్ రావు దుబ్బాక బస్టాండ్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో బస్టాండ్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి దిగారు.

బస్టాండ్ నిర్మించిన క్రెడిట్ మాదే అంటున్న ఇరు పార్టీలు
తాము అసెంబ్లీలో బస్టాండ్ నిర్మాణం గురించి ప్రస్తావించడం వల్లే ప్రస్తుతం బస్టాండ్ నిర్మాణం జరిగిందని బీజేపీ నేతలు చెబుతూ, దుబ్బాక కొత్త బస్టాండ్ బీజేపీ వల్లే వచ్చిందని ప్రచారం చేస్తుంటే, బి ఆర్ ఎస్ ఇచ్చిన హామీ మేరకు బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం స్పందించారు. తాను అసెంబ్లీలో ప్రస్తావించటం వల్ల బస్ స్టాండు నిర్మాణం జరిగిందంటూ చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ళ పర్వం
ఇక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య ఈ విషయంలో సవాళ్ల పర్వం చోటుచేసుకుంది. ఇది కాస్త చిలికిచిలికి గాలివానగా మారి బీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీలకు సిద్ధమయ్యారు. దీంతో చోటుచేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు బస్టాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు ఎవరికీ బస్టాండ్ లోకి ప్రవేశాన్ని అనుమతించడం లేదు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.

బస్టాండ్ వద్ద భారీ బందోబస్తు .. దుబ్బాకలో టెన్షన్
బస్టాండ్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సిద్ధిపేట సీపీ శ్వేతా స్వయంగా దుబ్బాక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి దుబ్బాక బస్టాండ్ విషయంలో చోటుచేసుకున్న ఈ వివాదం విషయంలో ఎవరూ తగ్గటం లేదు. దీంతో ముందు ముందు మరెన్ని తీవ్ర పరిణామాలకు కారణం అవుతుందో అన్నది స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
KCR మాస్ వార్నింగ్! డీలిమిటేషన్ పై కేంద్రానికి స్ట్రాంగ్ మెసేజ్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications