వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ లో ఉద్రిక్తత .. దిష్టిబొమ్మల దహనాలు, టీఆర్ఎస్ బీజేపీ నేతల బాహాబాహీ..రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్ బీజేపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను నిలువరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

 పాదయాత్రలో ఈటలకు పెద్ద చిక్కు ... బీజేపీతోనే తలనొప్పి .. హుజూరాబాద్ ఎన్నికలపై అంతర్మధనం !! పాదయాత్రలో ఈటలకు పెద్ద చిక్కు ... బీజేపీతోనే తలనొప్పి .. హుజూరాబాద్ ఎన్నికలపై అంతర్మధనం !!

దళిత బంధు పథకం ప్రకటన నాటి నుండి దళితుల టార్గెట్ గా రచ్చ

దళిత బంధు పథకం ప్రకటన నాటి నుండి దళితుల టార్గెట్ గా రచ్చ

హుజురాబాద్ ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు రంగంలోకి దిగి ఎన్నికల రాజకీయాన్ని రసవత్తరంగా మార్చాయి. తాజాగా దళిత బంధు పథకం నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య రగడ పీక్స్ కి చేరుకుంది. దళిత బంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసి, అక్కడ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో, ఈ నిర్ణయం పై బీజేపీ భగ్గుమంటుంది. ఎస్సీల ఓటు బ్యాంకు కోసం సీఎం కేసీఆర్ కుట్రలని విమర్శిస్తుంది.

ఎస్సీలను ఈటల జమున సోదరుడు కించపరిచాడని ఈటల కుటుంబం దిష్టి బొమ్మ దహనం

ఎస్సీలను ఈటల జమున సోదరుడు కించపరిచాడని ఈటల కుటుంబం దిష్టి బొమ్మ దహనం

ఇదిలా కొనసాగుతుండగానే ఎస్సీలను కించపరిచేలా ఈటల రాజేందర్ భార్య జమున సోదరుడు మధుసూదన్ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ దళిత నేతలు ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిని టిఆర్ఎస్ పార్టీ నేతలే సృష్టించారని బిజెపి తీవ్రంగా ధ్వజమెత్తింది. టీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో హుజరాబాద్ అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమున పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి పాలాభిషేకం నిర్వహించారు.

అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు

అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు


ఇదే సమయంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు బిజెపి నాయకులు ప్రయత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులను అడ్డుకోవడానికి రంగంలోకి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు బిజెపి నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు నినాదాలతో హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో హోరెత్తించారు. ఇక టిఆర్ఎస్, బిజెపి నాయకులు బాహాబాహీకి దిగడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు.

 టీఆర్ఎస్ బీజేపీ బాహాబాహీ ... పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు

టీఆర్ఎస్ బీజేపీ బాహాబాహీ ... పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు

బీజేపీ కార్యకర్తలను నిలువరించారు. టిఆర్ఎస్ వర్గీయులను అక్కడి నుండి పంపించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు పార్టీల నేతల ఆందోళనతో, ఘర్షణ లతో హుజురాబాద్ లో రాజకీయం హాట్ హాట్ గా తయారయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
Politics in Huzurabad constituency is becoming hot. A tense situation prevailed in Huzurabad in Karimnagar district today. TRS BJP factions descended on fight at Ambedkar junction in Huzurabad. The situation became tense as a scuffle broke out between the two factions. The police who landed in the field were attempted to custodize the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X