ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద ఉద్రిక్తత: జేసీపై దాడికి యత్నం
తొలిసారి వచ్చినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విడిచిపెట్టడంతో మరోసారి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
తొలిసారి వచ్చినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విడిచిపెట్టడంతో మరోసారి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
ఆంధ్రావాడిననే అరెస్ట్ చేశారు, అది నా ప్యాషన్: జేసీ ప్రభాకర్ రెడ్డి
టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిపైకి శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు దూసుకెళ్లారు. దాడి చేసేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేశారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపివేయడంతో వివాదం సద్దుమణిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అక్కడ్నుంచి పోలీసులు పంపివేశారు.
శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పాలెం దుర్ఘటనతో తమకు సంబంధం లేదని, ఆ బస్సు తమది కాదని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించినట్లుగా తమ ట్రావెల్స్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ అందర్నీ మిస్ లీడ్ చేస్తున్నారని జేసీ మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ తన పేరు ఎత్తకుంటే తాను స్పందించకుండా ఉండేవాడినని ఆయన తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని జేసీ చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తన బస్సులన్నింటికీ పన్ను కట్టినట్లు తెలిపారు. ఒకరికి మినహా పాలెం బాధితులందరికీ పరిహారం ఇచ్చామని ఆయన చెప్పారు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, అన్ని ఆధారాలు చూపిస్తానని చెప్పారు. తాను చర్చకు సిద్ధమని, అవసరమైతే శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్దామని అన్నారు.












Click it and Unblock the Notifications