రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో ఉద్రిక్తత: నియోజకవర్గంలో కూడా తిరగనివ్వరా మండిపడిన ఫైర్ బ్రాండ్!!

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఇందిరా గాంధీ చౌక్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకున్న క్రమంలో అనుమతులు లేకుండా ధర్నా చేయడం నేరమని పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు ఆపై రేవంత్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేదా: రేవంత్ అసహనం

తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేదా: రేవంత్ అసహనం


రేవంత్ రెడ్డి అరెస్ట్ కు ముందు రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి తనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తనను తన నియోజకవర్గంలో కూడా తిరగనివ్వరా అంటూ నిలదీశారు. తాను ధర్నా చౌక్ వద్దకు వెళుతున్నట్లు చెప్పానా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన, తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా పోలీసుల అనుమతి కావాలి అంటూ ప్రశ్నించిన ఆయన తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అరెస్ట్.. రేవంత్ అసహనం

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అరెస్ట్.. రేవంత్ అసహనం


అంతకు ముందు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం పైన కూడా రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను ఎక్కడినుంచి తీసుకువెళ్ళారో తిరిగి అక్కడికే తీసుకురావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో గ్రామ పంచాయతీల, సర్పంచ్ ల పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సర్పంచులకు తెలియకుండా 35 వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆరోపించారు.

బయటకు వెళ్లేందుకు రేవంత్ యత్నం ఉద్రిక్తత మధ్య రేవంత్ రెడ్డి అరెస్ట్

బయటకు వెళ్లేందుకు రేవంత్ యత్నం ఉద్రిక్తత మధ్య రేవంత్ రెడ్డి అరెస్ట్


అసలు తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బయటకు వెళ్ళటం కోసం రేవంత్ రెడ్డి యత్నం చెయ్యటంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క రేవంత్ రెడ్డిని మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో, మండల, జిల్లా కేంద్రాలలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ముందస్తు అరెస్ట్ లను నిరసిస్తూ జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు.

రేవంత్ తో పాటు కాంగ్రెస్ కీలకనాయకుల అరెస్ట్

రేవంత్ తో పాటు కాంగ్రెస్ కీలకనాయకుల అరెస్ట్


ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ఆందోళన చేస్తామని టిపిసిసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ సెల్ నేత కోదండ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+