భయపెడుతున్న ఇన్‌ఫ్లూయెంజా.. తెలంగాణా సర్కార్ అలెర్ట్; మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు!!
భయపెడుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులతో తెలంగాణా సర్కార్ అలెర్ట్ అయింది. మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భారతదేశాన్ని ఇప్పుడు ఇన్‌ఫ్లూయెంజా కేసులు వణికిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనూ ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగితే ఎలా అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కేసుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. H3N2 గా చెప్పబడే ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమై అధికారులకు వైరస్ కట్టడికి దిశానిర్దేశం చేసింది.
ఇన్‌ఫ్లూయెంజా వైరస్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్యశాఖ అధికారులతో ఈ మేరకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది అన్నదానిపై వివరాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏ వయసు వారిలో ఇది ఎక్కువగా విజృంభిస్తుంది? నియంత్రణకు చేయవలసింది ఏమిటి? అన్ని ఆసుపత్రులలో వనరులు ఉన్నాయా? వంటి అనేక వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా తరహాలో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందా? ఈ వ్యాధి సోకిన రాష్ట్రాలు, ఇతర దేశాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వంటి వివరాలను కూడా మంత్రి హరీష్ రావు తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం నుంచి చేయవలసిన దానిపైన వైద్యశాఖ అధికారులతో చర్చించిన హరీష్ రావు కీలక సూచనలు చేశారు.

పిల్లలలోనే ఎక్కువ కేసులు.. కీలక ఆదేశాలిచ్చిన మంత్రి హరీష్ రావు
ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పిల్లలలోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న క్రమంలో, పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేసి వారికి చికిత్స అందించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఒకవేళ శ్వాస సమస్యలు వస్తే ఆక్సిజన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేసుకోవాలని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్ లకు మంత్రి హరీష్ రావు సూచించారు. ముఖ్యంగా నీలోఫర్లో చిన్నారుల కోసం ప్రత్యేక వార్లను ఏర్పాటు చేయాలని సూచించారు .

ఆందోళన అవసరం లేదన్న మంత్రి
ఇన్‌ఫ్లూయెంజా కేసుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న మంత్రి హరీష్ రావు ఎవరికైనా జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందాలని, డాక్టర్ల సూచనలు, సలహాలు లేకుండా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ , యాంటీ బయోటిక్స్ వాడకూడదని సూచించారు.

కరోనా తరహాలో మాస్కులు, జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
ఈ సంవత్సరం జనవరి మొదటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 205 కేసులు నమోదు అయ్యాయని, కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇన్‌ఫ్లూయెంజా కేసుల నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లూయెంజా బారిన పడకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ తరహాలో తీసుకునే రక్షణ చర్యలను తీసుకోవాలని చెబుతున్నారు. H3N2 గా చెప్పబడే ఇన్‌ఫ్లూయెంజా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించబడింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications