కోర్టు వద్ద లేఖ విసిరి భత్కల్ హల్‌చల్: ఎవరి కోసం విసిరాడు?
హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు నిందితుడు యాసిన్ భత్కల్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద హల్ చల్ చేశాడు. భత్కల్‌ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. భత్కల్ హాజరు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

80 మంది వరకు భద్రతను ఉంచారు. భత్కల్ కోర్టు హాలు నుంచి వచ్చాక ఓ లేఖను విసిరాడు. దీంతో కలకలం చెలరేగింది. పోలీసులు వెంటనే ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
తన ప్రాణానికి ముప్పు ఉందని, తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ లేఖ ఎందుకు విసిరాడు, ఎవరికి ఇచ్చేందుకు విసిరాడు, ఏదైనా తప్పించుకనే ఉపాయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆ లేఖను అతను జైలులో ఉండగానే రాశాడా లేక బస్సులో కోర్టు హాలుకు తరలిస్తుండగా రాశాడా అనే విషయం పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పిటి వారెంటు పైన యాసిన్ భత్కల్‌ను పోలీసులు రాజస్థాన్ తీసుకు వెళ్లనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications