Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ వాసులకు బిగ్ అప్డేట్ - ఇక నుంచి ఇలా..!!

హైదరాబాద్ నగరంలో కొత్త మార్పులు రానున్నాయి. ఒక వైపు హైడ్రా కూల్చివేతల సమయంలోనే నగరంలో కొత్త రూపు రేఖల దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కొత్త ప్రణాళికలతో ప్రభుత్వం సిద్దమైంది. ఇందు కోసం పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. రూ 826 కోట్ల అంచనా వ్యయంకు ఆమోదం లభించింది. దీంతో, నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి కొత్తగా అయిదు ఫ్లైఓవర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణ చేపట్టాలని నిర్నయించింది. కెబిఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి నిత్యం ట్రాఫిక్ రద్దీ కనిపిస్తోంది. దీంతో, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం లవైపు అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఇందు కోసం రూ.826 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు.

TG govt approves flyovers worth Rs 826 around KCR park Details here

అనుమతి మంజూరు
ఈ మొత్తానికి ప్రభుత్వం పాలనా పరమైన అనుమతి మంజూరు చేసింది. అందులో భాగంగా తొలి దశలో 421 కోట్లతో ప్యాకేజీ-1లో జూబ్లిహిల్స్‌ చెక్‌ పోస్ట్‌..కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రెన్స్‌ దగ్గర జంక్షన్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్దం చేసారు. అదే విధంగా.. యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్‌ వరకు రెండు లైన్ల ప్లైఓవర్లను నిర్మిస్తారు. కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ ముగ్ధ జంక్షన్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు 2 లేన్ల అండర్‌పాస్‌ నిర్మించేలా ప్లాన్ చేసారు.

కొత్త ప్రణాళికలు
పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ప్లైఓవర్‌, కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ జంక్షన్‌ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్‌ పాస్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో ప్యాకేజీలో రోడ్ నెంబర్ 45 జంక్షన్ ను రూ 405 కోట్లతో డెవలప్ చేసేలా ప్లాన్ చేసారు. రోడ్‌ నెంబర్‌ 45, ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వైపు వరకు అండర్‌ పాస్‌ నిర్మిస్తారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి రోడ్‌ నెంబర్‌-45 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌ ఫిలింనగర్‌ జంక్షన్‌ 1, అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నెం.45 జంక్షన్‌ వరకు 2 లైన్ల అండర్‌పాస్‌ అభివృద్ధి చేయాలనేది ప్రణాళికల్లో భాగంగా ఉంది.

బడ్జెట్ అంచనాలు
ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చేశాయి. ఇన పనుల వేగవంతమే తరువాయి. అండర్ పాస్ ఫ్లై ఓవర్లు ,రేడియల్ రోడ్లతో కేబీఆర్‌ పార్క్ ప్రాంతంలో కొత్త తరహా మార్పు కనిపించనుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఒక వైపు హైడ్రా, మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతల ప్రక్రియ పైన విమర్శలు కొనసాగుతున్న వేళ ప్రభుత్వం హైదరాబాద్ పైన తమ విజన్ ఏంటో స్పష్టం చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+