బానిస బ్రతుకులు బ్రతుకుతున్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీకి పోలీస్ కుటుంబాల సంచలన లేఖ!

టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , డీజీపీ జితేందర్ కు, అలాగే టీఎస్ఎస్పీ ఏడీజీపీకి వన్ స్టేట్ వన్ పోలీస్ విధానం అమలు కోసం తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటితో తమ బాధను అర్ధం చేసుకోవాలని లేఖ రాశారు. తాము శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్నామని, రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని కోరారు.

తీవ్ర ఒత్తిడిలో రిజర్వ్డ్ పోలీస్ కుటుంబాలు
తాము ఒక చోట తమ భర్తలు మరోచోట ఉండాల్సి వస్తుందన, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా వారు రాలేకపోతున్నారని, అయితే తమకు సెలవు కావాలని గట్టిగా అడిగితే పై అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వారు తమ గోడు వ్యక్తం చేశారు.కుటుంబాలకు దూరంగా వారు, మాకు అవసరం అయినప్పుడు అండగా మా వాళ్ళు లేకపోవటం కారణంగా మేము చాలా ఒత్తిడికి గురవుతున్నామని పేర్కొన్నారు.

TGSP Police families sensational letter to CM Revanth Reddy and DGP

బానిస బ్రతుకులు బ్రతుకుతున్నాం
ఒక్కోసారి రెండు నెలలైనా ఇంటికి రాని పరిస్థితులు మమ్ములను ఆవేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఉద్యోగానికి ఆబ్సేంట్ కాలేక ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారని వాపోయారు. నెలల పాటు దూరంగా ఉండటం కారణంగా ఇంటికి వచ్చిన తండ్రిని సొంత బిడ్డలు గుర్తు పట్టటం లేదని, తండ్రి ప్రేమకు దూరంగా తమ పిల్లలు పెరుగుతున్నారని అన్నారు.

పశువుల కొట్టం కంటే దారుణంగా వసతి
అదే విధంగా హైదరాబాదులో టీజీఎస్పీ వారికి ఇచ్చే వసతి కూడా దారణం అన్నారు. హుస్సేనీ ఆలం, కవాడిగూడ, రాజేంద్రనగర్, బేగంపేట్ మొదలగు పోస్టింగ్స్ పశువులు, పందులు నివసించే దానికన్నా దారుణంగా ఉంటాయని, అలాంటి చోట తమ వారిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న రూములలో పది పది మందికి పైగా ఉంటూ.. అందులోనే టాయిలెట్స్, ఆ దుర్వాసనలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు.

తమ పిల్లల భవిష్యత్ ఏంటి?
రాత్రిపూట దోమలు, బొద్దింకలు, నల్లులు బాధ భరించలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వారి గోడు పట్టించుకోవాలన్నారు.తమ భర్తలను సిక్స్ మంత్స్ బెటాలియన్‌లో సిక్స్ మంత్స్ హైదరాబాద్‌లో తిప్పుతుంటే, మా పిల్లలను స్థిరంగా ఎక్కడ చదివించుకోలేకపోతున్నామని, తమ పిల్లల స్థానికత ప్రశ్నార్ధకం అవుతుందని తాము ఒకే చోట ఉంటే, తమ భర్తలకు దూరంగా జీవితాంతం బ్రతకాల్సి వచ్చేలా ఉందని వాపోయారు.

టీజీఎస్పీ పోలీసుల్లో భాగం కావడం తప్పా?
తమ వాళ్ళు ఇంటికి వచ్చిన సంతోషం ఎంతో సేపు ఉండటం లేదని, ఎప్పుడు వెళ్తారో అన్న ఆందోళన ప్రతీ క్షణం తమను బాధిస్తుందన్నారు. తమ వారిని అసలే పోలీసుల మాదిరిగా పరిగణించటంలేదని, టీజీఎస్పీ పోలీసుల్లో భాగం కావడం తప్పా? అని వారు లేఖలో ప్రశ్నించారు. సివిల్ ఏఆర్ వర్కర్ల కుటుంబాలు ఒకే పరీక్షకు హాజరై పోలీసు అధికారులుగా మారినంత సంతోషంగా ఈరోజు తమ కుటుంబాలు ఎందుకు లేవు? అని వారు ప్రశ్నించారు.

తమ ఆందోళనలో ఎవరి ప్రమేయం లేదు
దయచేసి తామంతా ఎందుకు ఆవేదనలో ఉన్నామో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాము జీతాలు పెంచాలని, టీఏ, డీఏ పెంచాలని ఆందోళన చేయటం లేదని, ఇందులో ఎలాంటి ప్రలోభాలు, ఎవరి ప్రమేయాలు లేవని పేర్కొన్నారు. మా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇది నిజం అంటూ వారు తమ కన్నీటి లేఖలో పేర్కొన్నారు. సివిల్ కానిస్టేబుల్ తరహాలో తమకు కూడా కుటుంబంతో గడిపేలా సమయం ఇచ్చేలా డ్యూటీలు ఇవ్వాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని వారు లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+