ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!!
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు తీపి కబురు అందించింది. బస్సు ల ఛార్జీలను తగ్గించింది. నిర్దేశించిన కేటగిరీల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ అన్ని డిపోలకు ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ప్రయాణీకుల ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునే క్రమంలో భాగంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ బస్సులో ఎంత మేర రిబేటు ఇస్తుందీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ రాయితీ వర్తింపు కు కాల పరిమితి ఖరారు చేసారు.
వేసవిలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల టికెట్ ధరలను తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ బస్సులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరంలో ప్రస్తుతం 275 మెట్రో డీలక్స్ బస్సులు 255 ట్రిప్పులు, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 731 ట్రిప్పులు తిరుగుతున్నాయి. వీటిలో 60 శాతానిపైగా ఆక్యుపెన్సీనే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ధరలను సవరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలు టికెట్ చార్జీలపై రాయితీని అందిస్తూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వేసవి వేళ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు
సాధారణంగా 60శాతం నమోదయ్యే ప్రయాణికుల ఆక్యుపెన్సీని వేసవిలో 90-100 శాతం పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌పోర్టు రూట్‌లో ఆర్టీసీ నడుపుతున్న 50 పుష్పక్ బస్సులు, నగర పరిధిలో 40 ఏసీ బస్సుల్లో రాయితీని వర్తింపజేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మెట్రో డీలక్స్ బస్సులో గతంలో నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.30 టికెట్ ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.25కు తగ్గించారు. ఇక ఈ-మెట్రో ఏసీ సర్వీసులో గతంలో రూ.35 ఉండగా ఇప్పుడు రూ.25కి తగ్గించారు. గ్రేటర్ హైదరాబాద్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. నగరంలో ప్రజా రవాణాను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సంస్థ 1085 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications