రూ.6,700.12 కోట్ల మహిళల డబ్బులు ఆదా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ అరుదైన రికార్డును నెలకొల్పంది. ఓ ల్యాండ్ మార్క్ ను అధిగమించింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు 200 కోట్లకు పైగా జీరో టికెట్లను జారీ చేసింది.

2023 డిసెంబర్ 9వ తేదీన టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనికోసం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడీ పథకం కింద జారీ చేసిన ఉచిత బస్ టికెట్ల సంఖ్య 200 కోట్లను దాటినట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

TGSRTC hit 200 Crore free women passengers in its buses

ఛార్జీల రూపంలో మహిళల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం 6,671.12 కోట్ల రూపాయలను ప్రభుత్వం పొదుపు చేసినట్టయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి.. మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 18 నెలల తమ ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి, ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోండటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలను తెలియజేస్తోన్నానని అన్నారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఇదే పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. ఈ 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన సమయంలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు.

ఇప్పుడా సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం రోజూ సుమారు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌ లో విద్యార్థినులు, ఉద్యోగినులతోపాటు సాధారణ మహిళలు.. రోజూ సుమారు 8 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం కింద మహిళలు సుమారు 6,700.12 కోట్లు ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకున్నట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+