మేడారం జాతర ప్రత్యేక బస్సులలో వారికి ఫ్రీ ప్రయాణం. తెలంగాణా ఆర్టీసీ తీపికబురు!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లను చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా ఉన్న మేడారం జాతర జనవరి 28వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు.

మేడారం జాతరకు తెలంగాణాలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దీంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుండి మేడారానికి బస్సులు నడవనున్నాయి. ముఖ్యంగా మేడారం జాతర జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా బస్సులను నడపనున్నారు. వరంగల్ నుండి మేడారానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) జాతర సందర్భంగా, సాధారణ రోజుల్లోనూ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

tgsrtc said good news special buses to medaram jathara and free tickets for those people

మేడారం జాతరకు వరంగల్ నుండి నాలుగు వేల బస్సులు
ముఖ్యంగా జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే 2026 మేడారం జాతర కోసం హనుమకొండ, వరంగల్ డిపోల నుండి బస్సులు నడపనున్నారు. జనవరి 25 నుండి 3000-4000 బస్సులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది, రద్దీని బట్టి బస్సులు నడుస్తాయి, ఖమ్మం రీజియన్ నుండి మొత్తం 224 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపాలని నిర్ణయించింది.

ఖమ్మం రీజియన్ నుండి బస్సులు ఇలా
ఖమ్మం నుండి 10, కొత్తగూడెం డిపో నుండి అత్యధికంగా 110, ఇల్లెందు నుండి 41, భద్రాచలం నుండి 21, పాల్వంచ నుండి 15 బస్సులు ఇందులో ఉన్నాయి. ఏటూరు నాగారం నుంచి 17 బస్సులు, వెంకటాపూర్ నుంచి 6, మణుగూరు నుంచి 16, మంగపేట నుంచి 5 బస్సులు మేడారానికి నడవనున్నాయి.ఇప్పటికే భూపాలపల్లి డిపో నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

ఈ ప్రాంతాల మీదుగా ప్రత్యేక బస్సులు
ములుగుఘనపూర్, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్రా, చెల్పూర్ మీదుగా ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఇవి రాత్రి వరకు నడుస్తాయి. మేడారం జాతరకు ఆర్టీసీ ప్రకటించిన ప్రత్యేక బస్సులలో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. కాబట్టి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులు కూడా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+