వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజం చెప్తే తల ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుంది.!అందుకే బీజేపి అబద్ధాలు.!కమలంపై హరీష్ రావు ఫైర్.!

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట/హైదరాబాద్ : బీజేపి నాయకులపై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపి జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా శనివారం పాలమూరులో చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నాయకులకు ఓ శాపం ఉన్నట్టుందని, నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉండబట్టే వాళ్లు నిత్యం అబద్ధం తప్ప నిజం మాట్లాడటం లేదని మండిపడ్డారు. నిన్న పాలమూరు మీటింగులో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి తెలంగాణ ప్రజలకు వినిపించి వెళ్లిపోయారని ఎద్దేవా చేసారు హరీష్ రావు.

 క్షేత్ర స్తాయి పర్యటనకు వస్తారా.? బీజేపి జాతీయ అద్యక్షుడు నడ్డాకు హరీష్ రావు సవాల్

క్షేత్ర స్తాయి పర్యటనకు వస్తారా.? బీజేపి జాతీయ అద్యక్షుడు నడ్డాకు హరీష్ రావు సవాల్

అంతే కాకుండా బిజెపి కేంద్ర మంత్రులకు, రాష్ట్ర బిజెపి నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని, కేంద్ర బిజెపిలో ఆధిపత్య పోరు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నదని, నితన్ గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెపితే, నాయకులు మరో మాట చెబుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో సిద్దిపేట పట్టణ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మంత్రి హరిష్ రావు బీజేపి వ్యవహారాలను ఏకరుపు పెట్టారు.

 పార్లమెంట్ లో ఒక మాట.. పాలమూరులో ఒక పాట.. మండి పడ్డి హరీష్ రావు

పార్లమెంట్ లో ఒక మాట.. పాలమూరులో ఒక పాట.. మండి పడ్డి హరీష్ రావు


బిజెపిది పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఇంకో పాట అని, శనివారం, బీజేపి జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా ప్రధానంగా నాలుగు విషయాలు ప్రస్తావించారని, ఆ అంశాల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు హరీష్ రావు. 1. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదు. 2. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది
3. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నరు. 4. బిజెపి అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నడ్డా ప్రస్తావించిన ఈ అంశాలన్ని అబద్ధాలే అన్నారు హరీష్ రావు.

 అవినీతి జరిగితే నిరూపించాలి.. కాళేశ్వరం పై క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమన్న హరీష్ రావు

అవినీతి జరిగితే నిరూపించాలి.. కాళేశ్వరం పై క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమన్న హరీష్ రావు

కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదన్న నడ్డాకు వాస్తవాలు తెలియవన్నారు మంత్రి హరీష్ రావు. తాను నడ్డా గారిని కోరుతున్నాని, తామే ఖర్చులు భరిస్తామని, రాష్ట్ర మంతా తిప్పుతామని, వారే నేరుగా రైతులతో మాట్లాడాలని మంత్రి కోరారు. తెలంగాణలో 33 జిల్లాలుంటే దాదాపు 20 జిల్లాల ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చుతుందన్న అంశం తెలుసుకోవాలన్నారు. క్షేత్ర పర్యటన చేసి నిజా నిజాలు తేల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని, రావడానికి మీరు సిద్ధమా?అని మంత్రి సవాల్ విసిరారు.

 అబద్దాల పురాణం ఢిల్లీ నేతలకు సంస్కారం కాదు.. చురకలంటించి మంత్రి హరీష్

అబద్దాల పురాణం ఢిల్లీ నేతలకు సంస్కారం కాదు.. చురకలంటించి మంత్రి హరీష్


నడ్డా వస్తారో లేదా ఎవరు వస్తారో రావాలని, తాను రైతుల సమక్షంలో ఏమీ మాట్లాడనని, రైతులే అన్ని అంశాలు చెప్తారని హరీష్ స్పష్టం చేసారు. ఎక్కడో ఎందుకు తమ సిద్దిపేటకు వచ్చి చూడాలని, 50 గ్రామాల్లో కాళేశ్వరం నీళ్లు చూపిస్తామని, పంట పొలాల్లో, కాలువల్లో గలగల పారుతున్న గోదావరి జలాల గురించి తాను కాదు
తమ రైతులు చెపుతారన్నారు మంత్రి హరీష్ రావు. బిజెపి రాష్ట్ర నాయకులు అవగాహన లేకుండా, అక్కసుతో రాసిచ్చిన స్క్రిప్టును చదివి అభాసు పాలు కావడం కన్నా గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకుని మాట్లాడితే మీ లాంటి ఢిల్లీ నాయకులకు గౌరవంగా ఉంటుందని హరీష్ నడ్డా కు సలహా ఇచ్చారు.

English summary
Medical Health Minister Harish Rao was angry with the BJP leaders. In particular, BJP national president JP Nadda's remarks in Palamur on Saturday were flagged as Harish Rao's aggravated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X