దేశ భవిష్యత్ ను మార్చే యాత్ర.!రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేస్తామన్న రేవంత్ రెడ్డి.!

హైదరాబాద్: భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు గాంధీ చేపట్టిన దండి యాత్రలా... భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఒక కీలకమైన భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. హైదరాబాద్ మణికొండలోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నివాసంలో మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో జరిగిన సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో కీలక చర్చలు జరుపుతున్నట్టు రేవంత్ వివరించారు.

 రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన.. రెట్టింపు ఉత్సాహం నింపుతామన్న రేవంత్ రెడ్డి..

రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన.. రెట్టింపు ఉత్సాహం నింపుతామన్న రేవంత్ రెడ్డి..


మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందం హైదరాబాద్ కు చేరుకున్నారని, కర్ణాటకలో 22రోజులు, ఏపీలో 4 రోజులు జోడో యాత్ర సాగుతుందని, ఆ తర్వాత అక్టోబర్ 24న రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణలో యాత్ర ముగిసిన తరువాత మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు.జోడో యాత్రపై ఒకరికొకరం సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ, మహారాష్ట్ర నేతలతో కలిసి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్బంగా చర్చించుకున్నట్టు రేవంత్ తెలిపారు.

 జోడో యాత్రను విజయవంతం చేస్తాం.. నేతల కీలక భేటీలో పీసిసి ఛీఫ్

జోడో యాత్రను విజయవంతం చేస్తాం.. నేతల కీలక భేటీలో పీసిసి ఛీఫ్

కర్ణాటకలో కూడా మహారాష్ట్ర, తెలంగాణ నేతలు పర్యటించాలనే అంశంపై చర్చించామన్నారు రేవంత్ రెడ్డి. చరిత్రలో ఒక కీలకమైన ఈ యాత్రలో పాల్గొనడం తమకు గొప్ప అవకాశమని, ఆనాడు గాంధీ చేపట్టిన దండి యాత్రలో యావత్ భారత దేశం ఏవిధంగా ఏకతాటిపై వచ్చిందో ఇప్పుడు అదే విధంగా భారత్ జోడో యాత్ర ద్వారా మళ్లీ ఏకాభిప్రాయం వస్తుందన్నారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా రాహుల్ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, దేశ భవిష్యత్ ను మార్చే యాత్ర భారత్ జోడో యాత్ర అని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

 అన్ని రాష్ట్రాల నేతలతో సమన్వయం.. కర్నాటకలో కూడా తెలంగాణ నేతలు పాల్గొంటారన్న రేవంత్

అన్ని రాష్ట్రాల నేతలతో సమన్వయం.. కర్నాటకలో కూడా తెలంగాణ నేతలు పాల్గొంటారన్న రేవంత్

తెలంగాణలో యాత్ర ముగిసిన తరువాత మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. జోడో యాత్రపై దేశ వ్యాప్తంగా సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నేతలతో కలిసి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో చర్చించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో కూడా మహారాష్ట్ర, తెలంగాణ నేతలు పర్యటించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మహారాష్ట్ర సీల్పీ నేత బాల సాహబ్ తోరాట్, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సెక్రెటరీలు సోనాల్ పటేల్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.

 ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు మల్లికార్జున్‌ ఖర్గే.. అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నామన్న మల్లు రవి

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు మల్లికార్జున్‌ ఖర్గే.. అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నామన్న మల్లు రవి

ఇదిలా ఉండగా కర్నాటకకు చెందిర మల్లికార్జున ఖర్గే 11 సార్లు ఎమ్మెల్యే & ఎంపీగా ఎన్నికయ్యారని, ప్రభుత్వ మరియు ప్రజా జీవితంలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారని మాజీ ఎంపీ, టీపిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి స్పష్టం చేసారు. ఖర్గే రాజ్యాంగం ప్రకారం నిరంతరంగా మార్పు కోసం కృషి చేస్తున్నారని, ఆయన మార్పు కోసం పనిచేయడం లేదని ఎవరైనా అంటే అది తప్పు అవుతుందని, అందుకే ఆయనకు మేము మద్దతునిస్తున్నామన్నారు రవి. అంతే కాకుండా ఏఐసీసీ అద్యక్ష ఎన్నికల్లో విజయాన్ని అందుకుటామనే ధీమాను కూడా మల్లు రవి వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+